Ads
సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం తో వారిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అక్టోబర్ రెండవ తేదీన నాగ చైతన్య, సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Video Advertisement
ఈ క్రమం లో, తాజాగా శ్రీరెడ్డి స్పందించారు. వారిద్దరూ ఎంతో క్యూట్ గా ఉంటారని, వారు విడిపోకూడదని శ్రీరెడ్డి గతం లో కోరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వారిద్దరూ విడిపోవడం బాధ గా ఉందని చెప్పుకొచ్చింది. సామ్ చాలా కష్టపడి పైకి వచ్చిందని, నాగ చైతన్య కు ఎదగడం పెద్ద కష్టం కాకపోవచ్చని చెప్పుకొచ్చింది. సామ్ సొంతం గా కష్టపడింది.. ఈ పర్టిక్యులర్ విషయం లో ఆమె రెండొందల కోట్లు తీసుకుంది అని అనడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. తనకు సామ్ కొన్ని విషయాల్లో నచ్చదని, ఈ విషయం లో మాత్రం బాధకలుగుతోందని చెప్పుకొచ్చింది.
Watch Video:
End of Article