Ads
సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం తో వారిద్దరూ విడిపోయారని సోషల్ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అక్టోబర్ రెండవ తేదీన నాగ చైతన్య, సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Video Advertisement
దీనిపై స్పందించిన సమంత తండ్రి తన మెదడు శూన్యమైంది అంటూ పేర్కొన్నారు. ఆయన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయనను ఓదారుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తొందరలోనే అంతా సర్దుకుంటుందని సర్ది చెప్తున్నారు. అన్ని పరిస్థితులు తొందరలోనే చక్కదిద్దుకుంటాయని, నెటిజన్లు ఆయనకు మద్దతునిస్తున్నారు.
End of Article