Ads
మనకు బాగా ఇష్టమైన వారు ఉన్నట్లుండి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం గా ఉంటుంది. అందులోను ప్రాణ స్నేహితులు దూరమైతే.. నరకం అనుభవిస్తాం. అయితే.. చనిపోయిన స్నేహితులు ఆత్మలుగా మారాక మనల్ని చూస్తారా? మనకు ఏమైనా చెప్పాలని అనుకుంటారా..? అన్నవి ఇప్పటివరకు సందేహాలుగానే మిగిలిపోయాయి. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ చెక్ లిస్ట్ మాత్రం కొత్త కథను చెబుతోంది.
Video Advertisement
ఈ చెక్ లిస్ట్ ఓ చనిపోయిన వ్యక్తి బతికున్నప్పుడు రాసి పెట్టుకున్నది. మనం బతికి ఉన్నప్పుడు ఏ పనులు చేసుకోవాలో చెక్-లిస్ట్ ను పెట్టుకుంటాం కదా.. అలాగే.. ఈ వ్యక్తి తాను చనిపోయాక తన స్నేహితుడు చేయాల్సిన పనులను ఓ చెక్ లిస్ట్ గా రాసి పెట్టుకున్నాడు. అది తన స్నేహితుడికి ఇచ్చాడు. “ఆఫ్టర్ డెత్ చెక్‌లిస్ట్ ఫర్ బెస్ట్ ఫ్రెండ్” అనే టైటిల్ తో ఉన్న ఈ చెక్ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఈ చెక్ లిస్ట్ లో ఈ వ్యక్తి ఐదు పనులను తన స్నేహితుడికి అప్పగించాడు.
#1. బ్రౌజర్ హిస్టరీ ని డిలీట్ చేయడం.
#2. “తాను శవపేటిక లో ఉన్నా”.. అని చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం.
#3. సీక్రెట్ వర్డ్ ని మర్చిపోవద్దు. ఆత్మలు నిజంగానే ఉంటె.. ఆ వర్డ్స్ నీకు నా ఉనికిని తెలియచేస్తూ ఉంటాయి.
#4. నేను ఇష్టపడని వ్యక్తి ఎవరో అతనికి “అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు” అని చెప్పండి.
#5. నన్ను గుర్తుపెట్టుకో..
ఈ ఐదు పాయింట్స్ ను సదరు వ్యక్తి చెక్-లిస్ట్ లో పెట్టాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ని చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ తనకు ఇలాంటి అనుభవం ఉందని చెప్పుకొచ్చింది. తన స్నేహితురాలు కూడా ఇలానే సీక్రెట్ వర్డ్ ను కోడ్ గా ఇచ్చిందని.. ఆ వర్డ్ ఎప్పుడైనా వినపడితే అది తానేనని నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది. తనకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ నేను ఆ కోడ్ వర్డ్ ని ఎవరితోనూ పంచుకోలేదని చెప్పుకొచ్చింది. తన ఉనికి నాకు తెలుస్తూనే ఉంటుందని, మా కమ్యూనికేషన్ ను ఎప్పటికి ఆపమని ఆమె చెప్పుకొచ్చింది.
End of Article