బిగ్ బాస్ సాయి తేజ అమ్మాయి గా మారిందని తెలిసాక స్పందించిన పేరెంట్స్.. ఎమోషనల్ కామెంట్స్..!

బిగ్ బాస్ సాయి తేజ అమ్మాయి గా మారిందని తెలిసాక స్పందించిన పేరెంట్స్.. ఎమోషనల్ కామెంట్స్..!

by Anudeep

Ads

ప్రియాంక అందరికి జబర్దస్త్ ఆర్టిస్ట్ గా పరిచయం. అసలు ప్రియాంక జన్మించినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరు సాయి తేజ. అయితే.. అతను సర్జరీ చేయించుకుని మగువగా మారారు. ఆ తరువాత జబర్దస్త్ వేదిక పై కూడా తన టాలెంట్ ను నిరూపించుకుని పాపులర్ అయ్యారు. తాజాగా జబర్దస్త్ ఐదవ సీజన్ లో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Video Advertisement

sai teja 1

నా తండ్రి లాబ్ లో అటెండర్ గా పని చేసేవారని.. ఓ ప్రయోగ సమయం లో ఆసిడ్ కారణంగా ఆయన తన కళ్ళను పోగొట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అందుకే… నేను అమ్మాయిగా మారిన విషయం నా తండ్రికి ఇంకా తెలియదని.. ఆ విషయాన్నీ చెప్పడానికి బిగ్ బాస్ మంచి వేదిక అని భావిస్తున్నానని చెప్పుకొచ్చిన సంగతి విదితమే. అయితే.. ఈ సంగతి సాయి తేజ తల్లితండ్రులకు తెలిసింది. వారు కూడా స్పందించారు. వారు ఏమి మాట్లాడారో.. బిగ్ బాస్ వీడియో రికార్డు చేసి.. హౌస్ లో ఉన్న ప్రియాంకకు చూపించారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఈ విషయాన్ని చూపించారు.

sai teja 2

ఈ వీడియో లో ప్రియాంక తండ్రి డిబి సింగ్ మాట్లాడుతూ..”నాన్న సాయి తేజ.. నువ్వు అమ్మాయిగా మారినా, అబ్బాయిగా మారినా.. మాకు మాత్రం నువ్వే సర్వం. నువ్వు అమ్మాయిగా మారినంత మాత్రాన ఆదరించడం మానేస్తాం అని మాత్రం అనుకోకు.. మేము నీ తల్లి తండ్రులమన్న విషయం గుర్తుంచుకో..” అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. బిగ్ బాస్ వల్ల ఏదైనా మంచి జరిగింది అంటే అది ఇదేనని అందరు ప్రశంసిస్తున్నారు. పేరెంట్స్ అంటే ఇలా ఉంటారు.. అంటూ పలువురు కామెంట్స్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Watch video:


End of Article

You may also like