గూగుల్ ఇమేజెస్ లో ఈ నెంబర్ ఎంటర్ చేయండి..ఆ తర్వాత గూగుల్ చేసే తమాషా ఏంటో చూడండి..!

గూగుల్ ఇమేజెస్ లో ఈ నెంబర్ ఎంటర్ చేయండి..ఆ తర్వాత గూగుల్ చేసే తమాషా ఏంటో చూడండి..!

by Anudeep

Ads

స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఇంటర్నెట్ ను మరింత ఎక్కువ గా వాడేస్తున్నాం. ప్రతి చిన్న విషయాన్నీ ఫోటో తీసుకుని మన సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్ లోడ్ చేసుకోవడం, ఇంకా తెలియని ఎన్నో విషయాలను గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాం. రోజు రోజుకు ఈ టెక్నాలజీ అప్ డేట్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో గూగుల్ కూడా గూగుల్ ఇమేజెస్ ని తీసుకొచ్చింది. ఇందులో మనం డైరెక్ట్ గా ఒక ఇమేజ్ అడ్రస్ కానీ, ఇమేజ్ ని కానీ పెట్టి సెర్చ్ చేసుకోవచ్చు.

Video Advertisement

google images 1

దానికి సంబంధించిన వివరాలను, అలాంటి ఫోటోలు ఇంకెక్కడైనా ఉన్నట్లయితే గూగుల్ వాటిని మనకి అందిస్తుంది. ఈ సమాచారమంతా క్షణాల్లో మన ముందుకు వస్తుంది. గూగుల్ లాంటి బ్రౌజర్లు ఇంకా ఉన్నప్పటికీ.. మనం ఎక్కువ గా గూగుల్ పైనే ఆధారపడుతున్నాం. గూగుల్ బ్రౌజర్ చూపించే సమాచారం మనకు ఎక్కువ రిలేటబుల్ గా వస్తుండడం తో మనం ఎక్కువగా గూగుల్ నే నమ్ముతున్నాం.

google images 2

ఐతే.. గూగుల్ ఇమేజెస్ లో “241543903” అని టైపు చేసి చూడండి. మీకు బోల్డెన్ని ఇమేజెస్ వస్తాయి. తమాషా ఏంటంటే ఈ ఇమేజెస్ అన్ని ఒకేలాంటివి. రకరకాల వ్యక్తులు తమ తలను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఫోటోలు మీకు దర్శనమిస్తాయి. ఇలా ఎందుకు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2009 లో డేవిడ్ హీర్వట్జ్ అనే ఓ వ్యక్తి ఓ ఫ్రిడ్జ్ ను కొనుగోలు చేసాడు. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న రోజులవి. మోజుకొద్దీ అతను ఫ్రిడ్జ్ తో ఫోటో తీసుకోవాలి అనుకున్నాడు.

google images 3

తన తలను ఫ్రిడ్జ్ లో పెట్టి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో ను “టంబ్లర్” అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.. సదరు వ్యక్తి ఆ ఫోటోను “241543903” నెంబర్ తో సేవ్ చేసాడు. ఆరోజుల్లో ఆర్క్యూట్ అనే సోషల్ మీడియా సైట్ లో కూడా చాలామంది ఆక్టివ్ గా ఉండేవారు. అది వాడేవారు కూడా అలాంటి ఫోటోలని తీసుకుని “241543903” నెంబర్ తోనే సేవ్ చేసారు. దీనితో.. గూగుల్ లో ఈ నెంబర్ కి ఈ ఫోటోలు సేవ్ అయిపోయి ఉన్నాయి. అదన్నమాట సంగతి. అందుకే ఆ నెంబర్ తో సెర్చ్ చేసినప్పుడు అలాంటి ఫొటోలే దర్శనమిస్తూ ఉంటాయి.


End of Article

You may also like