Ads
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన “పెళ్లి సందడి” సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ఇప్పటికీ టీవీ లో వస్తుంటే చూసి ఎంజాయ్ చేసేవారు ఉంటారు. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపొయింది. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా రవళి నటించారు. అమాయకత్వమైన మోము… అందంగా అభినయించడంతో ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
Video Advertisement
ప్రస్తుతం.. “పెళ్లిసందD” పేరుతొ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చిరు, వెంకీ మామ ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా హాజరు అయ్యారు.
అంతేకాదు.. అలనాటి “పెళ్లి సందడి” సినిమా టీం కూడా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరు అయ్యింది.ఈ సందర్భంగా అలనాటి అందాల తార రవళి కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు. పాత “పెళ్లి సందడి” సినిమాలో నటించిన మరో హీరోయిన్ దీప్తి భట్నాగర్ పెద్దగా మారలేదు. కానీ, రవళి మాత్రం అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పెళ్లి సందడి సినిమాలో ఆమె నటనకి, అందం, అభినయానికి చాలామంది దాసోహం అన్నారు. తాజాగా.. ఆమెను చూసి ఏంటి.. రవళి ఇలా మారిపోయింది అని అనుకుంటున్నారు.
అందం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అందాన్ని బట్టి ఒక వ్యక్తిని జడ్జి చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ మనందరికీ తెలిసిన అందాల తార రవళి ఒక్కసారిగా గుర్తుపట్టలేకుండా మారిపోవడం అనేది కొంచం ఆశ్చర్యం కలిగించే విషయమే. అందుకే “పెళ్లిసందD” ఈవెంట్ లో ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Watch Video:
End of Article