Ads
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర అందరికి సుపరిచితురాలు. రొటీన్ లవ్ స్టోరీ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా.. తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఆమె నటించిన శివ మనసులో శృతి, కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, జో అచ్యుతానంద సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇంకా కొన్ని సినిమాలు అంతగా ఆడలేదు.
Video Advertisement
ప్రస్తుతం.. ఆమె “ఈ బ్యూటీ నేనేనా” అనే ఓ హారర్ సినిమాలో నటిస్తున్నారట. ఇది కాకుండా ఓ పాపులర్ వెబ్ సిరీస్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో రూపొందనుందని సమాచారం. రాజ్-డీకే లు వరస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ను తెరకెక్కిస్తున్నారు. వీరి ప్రాజెక్ట్స్ లో ఈ అమ్మడికి కూడా ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఈ సిరీస్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించనున్నారట. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కూడా ఇందులో నటిస్తున్నారని సమాచారం.
సాధారణంగా హీరోయిన్స్ తమకు వస్తున్న అవకాశాలను బాగా వినియోగించుకోవడంలో ముందుంటారు. రెజినా కూడా అదే అనుకున్నట్లు ఉన్నారు. ఆమె ఓ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ట్రోల్ చేయడానికి ఏముంది అనుకుంటున్నారా? ఆమె దేనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారో తెలుసా? ఓ మద్యం బ్రాండ్ కి.
ఇటీవల, ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసారు. “9 సంవత్సరాల వయసులోనే యాంకరింగ్ తో కెరీర్ ప్రారంభిచానని.. ప్రస్తుతం కొన్ని కమర్షియల్ చిత్రాల్లోనూ నటిస్తున్నానని.. ఇవి చేస్తూనే కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించాలి” అని అనుకుంటున్నట్లు ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వ్యక్తపరిచారు. ఈ సంతోషాన్ని సిగ్నేచర్ ద్వారా సెలెబ్రేట్ చేసుకుంటున్నా… అని ఆమె పోస్ట్ చేసారు. దీనితో నెటిజన్లు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం ఇలాంటివి ప్రమోట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
End of Article