Ads
రెండు రోజుల క్రితం గుడ్ న్యూస్ చెప్తాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంచు విష్ణు, ఎట్టకేలకు ఆ విషయం గురించి చెప్పారు. మా అసోసియేషన్ లో ఈసారి మహిళలకి పెద్దపీట వేసినట్లు విష్ణు తెలిపారు. అందుకోసం ఒక కమిటీ నిర్మించినట్టు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, సునీత కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారు అని చెప్పారు.
Video Advertisement
“ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో నలుగురు ఆడ వాళ్ళు, ఇద్దరు మగ వాళ్ళు ఉంటారు. భవిష్యత్తులో ఈ కమిటీలో ఇంకా సభ్యులు చేరుతూ ఉంటారు. ఈ కమిటీ యొక్క మొదటి లక్ష్యం “మా” కుటుంబాన్ని కాపాడడం అని, ఆడవాళ్లు ఇంకా శక్తివంతంగా ఉండాలి” అని మంచు విష్ణు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
#MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF
— Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021
End of Article