Ads
బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 6 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని సమాచారం.
Video Advertisement
ఇది ఇలా ఉంటె.. బిగ్ బాస్ ఐదవ సీజన్ లో టైటిల్ విన్నర్ గురించి శ్వేతా వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో సన్నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని.. అతనే విన్ అవుతాడని అనుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక టాప్ త్రీ పొజిషన్స్ గురించి చెప్తూ… మానస్, అనీ మాస్టర్ రెండు మూడు స్థానాలలో ఉండొచ్చని చెప్పుకొచ్చారు. మరి శ్వేతా వర్మ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది చూడాల్సిందే.
End of Article