Ads
సోషల్ మీడియాను సరైన పద్ధతులు వాడుకుంటే ఎన్నో మంచి పనులు జరుగుతాయి అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. స్కూల్ బ్యాగ్ ధరించి ఒంటికాలితో నడుస్తూ బీహార్ కు చెందిన బాలిక వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Video Advertisement
బీహార్ లో జముయ్ జిల్లాలోని ఒక పల్లెటూరికి చెందిన సీమా అనే బాలిక రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు తన కాలును పోగొట్టుకుంది. ఐదో తరగతి చదువుతున్న సీమా ప్రతి రోజు ఒంటి కాలుతోనే ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా స్కూల్ కు వెళుతూ వస్తుంది.
చదువుకోవడం కోసం ఇంత కష్టపడుతున్న సీమా వీడియో చూసిన సోనూ సూద్ పాటు చాలామంది ప్రముఖులు మనసు కలచివేసింది. ఆ బాలికకు కృత్రిమ కాలు అమర్చేందుకు సహాయం చేస్తామంటూ ముందుకొచ్చారు.
ఎవరి అవసరం లేకుండానే బీహార్ విద్యాశాఖ చిన్నారికి కృత్రిమ కాలు అమర్చేందుకు ముందుకొచ్చింది. బీహార్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్, బగల్ శాఖ ఆధ్వర్యంలో సీమా కాలు కొలతలు తీసుకుని రెండు రోజుల తర్వాత కృత్రిమ కాలును తీసుకువచ్చి అమర్చింది. ప్రస్తుతం సీమా తన రెండు కాళ్ళతో నడవ కలుగుతుంది.
జముయ్ జిల్లా అధికారులు సీమాకు ఒక వీల్ చైర్ మరియు ట్రై సైకిల్ సహకారంగా అందించారు. సీమా ఘటనతో బీహార్ విద్యాశాఖ కదిలివచ్చింది. బీహార్ రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు లోపు వైకల్యంతో ఇబ్బందిపడుతూ ఉన్నా పిల్లలపై సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది. సీమాకు కాలు అమర్చడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంత సోషల్ మీడియా పుణ్యమే అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
End of Article