Ads
టాలీవుడ్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న సునీత ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్నారు. తాజాగా.. డ్రామా జూనియర్స్ షో లో ఆమె అలరించారు. ఈ సందర్భం గా ఆమెకు ఓ అనూహ్యకర పరిణామం ఎదురైంది. డ్రామా జూనియర్ షో లో ఓ బుడ్డోడు ఏకం గా సునీత తోనే పులిహోర కలిపేసాడు. బుడ్డోడి మాటలకి మొదట సునీత షాకయినా ఆ తరువాత హాయిగా నవ్వేశారు.
Video Advertisement
డ్రామా జూనియర్ షో లో ఓ బుడ్డోడు మన్మధుడు స్పూఫ్ తో స్కిట్ చేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. స్కిట్ పూర్తయ్యాక సింగర్ సునీత ఆ బుడ్డోడి తో మాట్లాడుతూ.. నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలో చెప్పు..? అని అడుగగా ఆ బుడ్డోడు వెంటనే నీ లాంటి గర్ల్ ఫ్రెండ్.. అంటూ సమాధానం ఇచ్చి సునీతకే షాకిచ్చాడు. వెంటనే అందరు నవ్వేశారు.
End of Article