Ads
ప్రస్తుతం యావత్ భారతాన్ని వేధిస్తున్న సమస్య కరోనా.. హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకోవడం మంచిది అని అందరు భావిస్తున్నా.. భారత్ లో చాలా మందికి ఇంట్లోనే ఐసొలేట్ అయి ఉండే పరిస్థితులు లేవు. మధ్య తరగతి కుటుంబాల్లో కూడా చాలా మంది రెండు గదులలోనే సంసారాన్ని నెట్టుకొచ్చే వారు ఉన్నారు.
Video Advertisement

ఇలాంటి కుటుంబాలలో ఎవరికైనా కరోనా సోకితే వారి పరిస్థితి ఏంటి..? ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉండడం, పట్టించుకునే వారు లేకపోవడం వంటి కారణాల వలన ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని భావించే వారు కోకొల్లలు. కానీ.. వారికి అనువైన వసతి ఇంట్లో లేకపోవడం కొంత ఇబ్బంది గా పరిణమిస్తోంది. అయితే… ఈ కుర్రాడు మాత్రం తాను ఐసొలేట్ అయి ఉండడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇంటి వద్దనే.. ఒక చెట్టు పైన కర్రలతో చిన్న మంచం లాగా..అతను పడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. గత తొమ్మిది రోజులుగా అతను ఆ చెట్టుపైనే ఐసొలేట్ అయి ఉంటున్నాడు. అతని ఇంట్లో ఒక్క గదే ఉండడం తో ఇంట్లో వారికి సోకకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేసుకుని కరోనా కు చెక్ పెడుతున్నాడు. రోజూ అతని కుటుంబ సభ్యులు చెట్టు వద్దకే ఆహారాన్ని అందిస్తున్నారు. అతను మందులు వేసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నాడు. మనసుంటే మార్గాలనేకం అనడానికి ఇతనే ఓ ఉదాహరణ.
watch video :
End of Article
