వింత వ్యాధి.. పసుపు పచ్చగా మారిపోతున్న బాలుడి నాలుక.. కారణం ఇదే..!

వింత వ్యాధి.. పసుపు పచ్చగా మారిపోతున్న బాలుడి నాలుక.. కారణం ఇదే..!

by Anudeep

Ads

కెనడా లో 12 సంవత్సరాల బాలుడికి నాలుక పచ్చగా మారిపోతోంది. వైద్యులు ఇది చాలా అరుదైన వ్యాధి అని.. దీనిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామని చెబుతున్నారు. కోల్డ్ అగ్లుటినిన్ అని ఈ వ్యాధిని పేర్కొంటారు. ఓ వైపు కొత్త వైరస్ లు, వేరియెంట్ లతో భూగోళం అల్లాడిపోతోంది. ఈ పరిస్థితిల్లో ఇలాంటి వింత వ్యాధులు ప్రబలుతుండడం తో స్థానికులు గాబరా పడుతున్నారు.

Video Advertisement

cold aglutinin

ఈ వింత వ్యాధి ఎర్ర రక్తకణాలపై దాడి జరగడం వలన వస్తుంది. ఈ బాలుడికి ఉన్నట్లుండి మూత్రం లో ఇబ్బందులు రావడం, గొంతులో నొప్పి, చర్మం లో తేడాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించడం తో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వ్యాధి వలన రక్త హీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాలలో బలం తగ్గుతుంది. ఇది కామెర్లకు దారి తీసే అవకాశం ఉంటుంది. గత ఏడువారాల పాటు ఈ బాలుడికి చికిత్స అందించారు. చికిత్స లో భాగం గా స్టెరాయిడ్లను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ బాలుడు కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ బాలుని నాలిక కూడా క్రమం గా మాములు అయ్యింది.


End of Article

You may also like