దొంగతనం చేయడానికి వస్తే..ఆ దొంగ ను చంపి 15 సంవత్సరాలు శవాన్ని దాచి.. ఆ తరువాత..?

దొంగతనం చేయడానికి వస్తే..ఆ దొంగ ను చంపి 15 సంవత్సరాలు శవాన్ని దాచి.. ఆ తరువాత..?

by Anudeep

Ads

ఎన్డీటీవీ కధనం ప్రకారం, ఆస్ట్రేలియా లో 2002 వ సంవత్సరం లో షేన్ స్నెల్‌మన్‌ అనే వ్యక్తి సిడ్నీకి చెందిన బ్రూస్ రాబర్ట్స్ ఇంట్లో దొంగతనం చేయడానికి చొరబడ్డాడు. అయితే.. అతడిని రాబర్ట్స్ హత్య చేసాడు. అయితే ఆ విషయం బయటకు రాకుండా ఉండడానికి శవాన్ని దాచిపెట్టాడు. ఆ శవం నుంచి వాసన రాకుండా ఉండేందుకు దాదాపు 70 ఎయిర్ ఫ్రెష్ నర్స్ ను ఉపయోగించాడట. దీనితో ఈ విషయం ఎవరికీ తెలియలేదు.

Video Advertisement

sidney police

ఆ తరువాత, 2017 లో రాబర్ట్స్ కూడా సహజ మరణం పొందాడు. దీనితో.. ఇరుగు పొరుగు వారు ఎమర్జెన్సీ సేవలందించేవారిని అలెర్ట్ చేసారు. ఆయన బాడీ హీటర్ పై పడిపోవడాన్ని వారు గుర్తించారు. కానీ, 2002 లో చనిపోయిన స్నెల్ మన్ శవం గురించి మాత్రం ఎవరికీ తెలియలేదు. ఆ తరువాత ఒక ఏడాది గడిచాక.. ఎస్టేట్ ను క్లియర్ చేయడం కోసం ఆ ఇంటిని క్లీన్ చేయడానికి వచ్చిన క్లీనర్లు స్నెల్ మన్ శవాన్ని గుర్తించారు. రాబర్ట్ తన ఇంట్లోంచి చాలా అరుదుగా బయటకు వచ్చేవాడు. అంతే కాదు.. ఆ ఇంట్లో డజనుకు పైగా తుపాకీ లు కూడా దొరికాయి.


End of Article

You may also like