లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఉన్న ఊరిలో ఉండలేక, సొంత ఊర్లకు వెళ్లలేక వలసకూలిలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు..గమ్యం చేరే వరకు డౌటే క్షేమంగా చేరుకుంటామో లేమో అని…కన్నబిడ్డను వెంటబెట్టుకుని అందరిలానే  సొంతఊరికి పయనమైంది ఒక తల్లి..మార్గమధ్యలోనే ఆకలితో నీరసించి ప్రాణాలు విడిచింది..అమ్మ ప్రాణం లేదని,ఇక లేవలేదని తెలియని అభం శుభం తెలియని ఆ  పసికందు అమ్మ చుట్టే తిరుగుతున్న ఘటన అందరిని కలిచి వేస్తుంది.

Video Advertisement

బీహార్ లోని ముజఫర్ పూర్ రైల్వేస్టేషన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తోంది..గుజరాత్ నుండి బయలుదేరిన శ్రామిక్ రైలులో సొంతూరికి బయలుదేరింది ఒక వలసకూలి..చేతిలో రెండేళ్ల పిల్లాడు ఉన్నాడు..ఆకలికి తట్టుకోలేక, డీహైడ్రేషన్ కి గురై బీహార్ లోని ముజపర్ పూర్ స్టేషన్ వచ్చేసరికి ట్రెయిన్లో కుప్పకూలిపోయింది..చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత ఆమె బాడీని స్టేషన్లోని ప్లాట్ ఫాంపై పెట్టేసారు.

తన తల్లి తిరిగిరాని లోకాలకి వెళ్లిందని తెలియని ఆ చిన్నారి తల్లి మృతదేహం చుట్టూ ఆటలాడుతుంది. తల్లి పడుకుందనుకుని తనపై కప్పిన క్లాత్ ని తీస్తూ ,తల్లిని మేల్కొల్పుతూ..మళ్లీ అక్కడే ఆడుకుంటున్న  చిన్నారిని చూసిన వారిని కలచివేస్తుంది. ఆ చిన్నారి వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది..ఇంతకీ ఆ మహిళ ఎవరూ? ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.కరోనా చావులకంటే ఆకలి చావులే ఎక్కువ నమోదవుతున్నాయనడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ ఈ తల్లి మరణం..ఇప్పటికే రవాణా సౌకర్యాలు స్తంబించి వలసకూలిలు కాలినడకన సొంత ఊర్లకు పయణమయ్యారు.. ఆకలి బాధలు , మరో వైపు ఎండ వేడికి తాలలేక, రోడ్డుప్రమాదాలకు గురై అనేక మంది గమ్యం చేరేలోపే మృత్యువాత పడుతున్నారు..