ప్రభాస్, కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోందని నేషనల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంది. ఇక కృతి సనన్ ఇప్పుడు వరుణ్ ధావన్ భేడియా (తెలుగులో తోడేలు) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పరోక్షంగా ప్రభాస్ మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే తామిద్దరి మధ్య ఏమి లేదని కృతి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Video Advertisement

అయితే ఈ విషయం పై తాజాగా ప్రముఖ రివ్యూయర్, క్రిటిక్ అయిన ఉమైర్ సంధూ కూడా ట్వీట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు మండి పడుతున్నారు. ఉమైర్ సంధూ నిత్యం పలు సినిమాలపై సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తుంటాడు. తాజాగా ప్రభాస్-కృతి బంధంపై కూడా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

umair sandhu comments on kriti sanon..!!

“మీ బంధాన్ని ఎందుకు దాస్తున్నావ్ కృతి సనన్..?? ధైర్యం ఉంటే అందరి ముందు ఒప్పుకో..” అని ఉమైర్ తాజా గా ట్వీట్ చేసాడు. గతంలో కూడా ఉమైర్ సందు వీరిద్దరి బంధం గురించి పలు ట్వీట్ లు చేసాడు. “అధికారికంగా చెబుతున్నాను.. ఆదిపురుష్ షూటింగ్ లో కృతిసనన్ కు ప్రభాస్ యే లవ్ ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే నిశ్చితార్థం” అంటూ రెండు హార్ట్ ఎమోజీలను గతం లో షేర్ చేశాడు.

umair sandhu comments on kriti sanon..!!

అయితే ఇది ఫేక్ న్యూస్ అని ప్రభాస్ అభిమానులు ఉమైర్ సంధుని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు కృతి సనన్ కూడా అలాంటిదేమి లేదని చెప్పడంతో ఉమైర్ ఆమెను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసాడు. అయితే దాదాపు రెండున్నర నెలల కిందట అందరికన్నా ముందు ప్రభాస్- కృతి రిలేషన్ లో ఉన్నారంటూ ట్వీట్ చేసిన మొదటి వ్యక్తి ఉమైర్ సందు నే కావటం విశేషం.