ఇంట్లో కూర్చుని 62 కోట్లు సంపాదించారు.. పోలిసుల విచారణలో షాకింగ్ నిజాలు.. మీరూ మోసపోవచ్చు జాగ్రత్త..!

ఇంట్లో కూర్చుని 62 కోట్లు సంపాదించారు.. పోలిసుల విచారణలో షాకింగ్ నిజాలు.. మీరూ మోసపోవచ్చు జాగ్రత్త..!

by Anudeep

Ads

డబ్బు ఎంత అవసరమో.. దానిని సంపాదించడం అంత కష్టం కూడా. అనుకోకుండా జాక్ పాట్ తగలడమో.. వ్యాపారం కలిసొస్తేనో.. ఆస్తులు కలిసొస్తేనో తప్ప కోట్లు సంపాదించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఈ క్రమం లోనే కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈజీ మనీ కోసం వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Video Advertisement

gang lute money from people

కడపకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇలాంటి మోసానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కడప వన్ టౌన్, చాపాడు, దువ్వూరు, మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల కారణం ఒక్కటే. కొన్ని మనీ యాప్స్, లింక్స్ లను క్లిక్ చేయడం వల్ల డబ్బులు నష్టపోయామని ఫిర్యాదులు రావడం తో పోలీసులు షాక్ అయ్యారు. ఈ కేసును సీరియస్ గా ఛేదించాలనుకున్నారు.

gang lute money from people

విచారణలో తేలింది ఏమిటంటే.. కొందరు వ్యక్తులు దాదాపు వందమందికి మూడు కోట్ల రూపాయలను టోపీ పెట్టారని తేలింది. ఆర్సీసీ, మేకింగ్ మని వంటి కొన్ని యాప్స్ పేరుతొ వీరు బల్క్ లో మెసేజ్ లు పంపుతూ ఉంటారు.ఆ లింక్స్ ను క్లిక్ చేసిన వారికి కొన్ని టాస్క్ లు పూర్తి చేసి పెట్టుబడి పెడితే కమిషన్ వస్తుందని ఆశ చూపిస్తారు. టాస్క్ ను బట్టి పెట్టుబడి పెట్టాలని చెబుతారు.

gang lute money from people

అలా బాధితులు ఆశకొద్దీ ఎక్కువ డబ్బులు పెట్టి మోసపోతున్నారు. ఇక, ఎవరైనా తక్కువ మొత్తాలలో డబ్బు పెడితే.. వారికి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి మరింత పెట్టుబడి పెట్టేవిధం గా ఆశ రేకెత్తిస్తారు. ఇలా వారు వారి స్నేహితులకు కూడా చెప్పి ఇందులో చేర్పించడం వలన వీరు ఎక్కువ మొత్తం లో డబ్బులు గుంజి.. చివరకు టోపీ పెట్టేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. దాదాపు 23 బ్యాంకు ఖాతాలు వీరి సొంతం గా ఉన్నాయి. ఇందులో ఉన్న రూ.62.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసారు.

Watch Video:


End of Article

You may also like