Ads
ప్రభుత్వ ఉద్యోగం రావడం అంత సులభం కాదు. ఎంత కష్టపడినా సరే చాలా మంది విఫలమవుతూ ఉంటారు. పైగా కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలుని సాధించింది ఈ అమ్మాయి. చిన్నప్పటి నుండి చదువు మీద ఆమెకు ఉండే ఆసక్తి ఆమెని ఇంత వరకు తీసుకు వచ్చింది.
Video Advertisement
ఇక మరి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శిరీష గురించి చూద్దాం. శిరీష తండ్రి రమణ వ్యవసాయం చేస్తున్నారు. తన తల్లి సావిత్రి నిమ్మనపల్లె లో ఏఎన్ఎం గా పని చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి కూడా శిరీష కి చదువు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎంటెక్ వరకు ఆమె చదివింది. ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి ఉద్యోగాన్ని కూడా ఈమె సాధించింది. మదనపల్లె మున్సిపాలిటీ లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈఏ గా పనిచేస్తోంది. అయితే శిరీష 2017 లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన అన్ని ఉద్యోగాలకు కూడా అప్లై చేసింది. ఈమె ఫిబ్రవరి, ఏప్రిల్ పరీక్షలు వ్రాసింది.
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ హైడ్రొలోజిస్ట్, ఎన్విరాన్మెంటల్ విభాగంతో పాటు జెన్కో తో కలిపి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఈమె సాధించింది. అంతేకాదు 2018 జనవరి లో ప్రిలిమినరీ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించింది. అయితే ఈమె కడప గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో జిల్లా అధికారిక ఒక నెల రోజుల పాటు పని చేసింది.
కానీ జన్మభూమి పై ఉండే మమకారం వలనే ఆ ఉద్యోగాన్ని వదులుకుని మదనపల్లి మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ లో ఏఈ గా ఈమె పని చేస్తోంది. నిజంగా శిరీషని ఆదర్శంగా తీసుకుని అమ్మాయిలు చదువుకుంటే కచ్చితంగా ఆమె లాగ కెరియర్లో సక్సెస్ అవ్వొచ్చు.
End of Article