ప్రేమ గుడ్డిది అని ఇప్పటికే ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తమకు కులమతాలతో పాటు వయసుతో కూడా సంబంధం లేదని ప్రేమికులు నిరూపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మరో ప్రేమ విషయం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 24 ఏళ్ల యువతి తన తాత కంటే పెద్దవాడైన 85 వృద్ధుడిని పెళ్లి చేసుకుంది. అమెరికా లో జరిగిన ఈ పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Video Advertisement

 

అమెరికాలోని మిస్సిస్సిప్పిలోని స్టార్క్‌విల్లే అనే ప్రాంతంలో 24 ఏళ్ల నైజీరియన్ యువతి మిరాక్లే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె 2019లో లాండరెట్‌ లో నర్సుగా పనిచేస్తున్నప్పుడు చార్లెస్ పోగ్ (85) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరి మధ్య 61 సంవత్సరాల గ్యాప్ ఉన్నాసరే పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు.

24 year old girl marries 85 year old man in america..

 

రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనిచేసిన చార్లెస్ పోగ్ రిటైర్డ్ అయి ఖాళీగా ఉంటున్నారు. స్నేహంగా సమయంలో ఆ యువతిపై చార్లెస్ అభిమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన, ఎదుటి వారితో మాట్లాడే విధానం ఆయనకు బాగా నచ్చింది. అలా ఓ సంవత్సరం పాటుఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఇటీవలే ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు చార్లెస్. ఆమె కూడా అతడి ప్రేమను ఒప్పుకుంది. చార్లెస్ తో పెళ్లికి ఆమె తల్లి తమికా ఫిలిప్స్, తాత జో బ్రౌన్ మద్దతుగాఫ్ నిలవగా.. ఆమె తండ్రి కరీమ్ ఫిలిప్స్ ఒప్పుకోలేదట. చివరికి ఎలాగోలా తండ్రిని ఒప్పించి ఆమె పెళ్లి చేసుకుంది.

24 year old girl marries 85 year old man in america..

తమ పెళ్లి కొందరికి వింతగా అనిపించి ఉండవచ్చు.. కానీ మాకు మాత్రం వింతగా అనిపించలేదు అని మిరాక్లే తెలిపింది. అతడితో తన కొత్త జీవితం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అయితే మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. వయస్సు బేధం చూడకూడదని ఆమె తెలిపింది. ఆ తర్వాత ఈ జంట ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించారట. కానీ ఈ వయసులో చార్లెస్ కి బిడ్డలు పుట్టడం అసాధ్యం కాబట్టి ఆ ప్రక్రియను మధ్యలోనే వదిలేసారట. ప్రస్తుతం వీరి ప్రేమకథను తెలుసుకున్న నెటిజన్లు వీరికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.