నిశ్చితార్తం తర్వాత ఫ్రెండ్స్ ముందు అలా హేళన చేసాడు…ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాలా.? వద్దా.?

నిశ్చితార్తం తర్వాత ఫ్రెండ్స్ ముందు అలా హేళన చేసాడు…ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవాలా.? వద్దా.?

by Mohana Priya

Ads

భారతదేశం చాలా అభవృద్ధి చెందింది. చుట్టూ ఉన్న పరిసరాలు, వస్తువుల వాడకాలు అన్ని చాలా మారాయి. మనుషుల ఆహారపు అలవాట్లు, జీవన శైలి అన్ని మారాయి. కాని కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి.

Video Advertisement

అందులో ఒకటి వేరే వారికి గౌరవం ఇవ్వటం. గౌరవం అంటే ఎదుటివారిని మీరు, గారు అని పిలవడం కాదు వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం.

Story of a chubby girl

చాలా మంది అలా గౌరవించకపోయినా కూడా సర్దుకుపోతున్నారు. కొంత మంది మాత్రం ఇలాంటి విషయాలను పొరపాటు అయితే పొరపాటు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఒక యువతి తన సమస్యని మనతో పంచుకొని, దానికి పరిష్కారం ఇవ్వమని అడిగారు. ఆ సమస్య ఏంటో ఆ యువతి మాటల్లోనే విందాం.

Story of a chubby girl

“నా పేరు విద్య. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఎక్సర్సైజ్ లు చేసినా సరే నేను లావు తగ్గలేదు. డాక్టర్ ని సంప్రదిస్తే నా శరీరతత్వమే అంత అని చెప్పారు. కొద్ది రోజులకి మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. అతనితో మాట్లాడాను. నాకు నచ్చాడు.

Story of a chubby girl

నేను కూడా అతనికి నచ్చానని చెప్పాడు. దాంతో నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళు దొరికారు అని నేను చాలా ఆనందించాను. మాకు కొద్ది రోజులకి నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత నుంచి అతనిలో మార్పు మొదలవడం నేను గమనించాను. నాతో సరిగా మాట్లాడే వాడు కాదు. ఒకవేళ మాట్లాడినా కూడా మధ్య మధ్యలో నా గురించి ఏదో ఒకటి అని వెక్కిరిస్తూ ఉండేవాడు.

Story of a chubby girl

 

ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేద్దామని తీసుకెళ్ళాడు. అక్కడ కూడా ఊరికే నా శరీరాకృతి గురించి వెక్కిరిస్తూ మాట్లాడాడు. నేను “ఏంటిది?” అని అడిగితే “ఇదంతా జోక్. సరదాగా అంటున్నాను. సీరియస్ తీసుకోకు” అని చెప్పాడు. కానీ ప్రతిసారీ ఇలాగే నేను లావుగా ఉన్నాను అంటూ ఎగతాళి చేస్తూ ఉంటాడు.

Story of a chubby girl

నాకు ఇలాంటి వాడితో ఉండాలి అని లేదు. కానీ నా తల్లిదండ్రులకు ఈ విషయం ఎలా చెప్పాలో అని భయమేస్తోంది. నేను ఏం తప్పు చేశాను? నేను ఇలా లావుగా ఉండడంలో నేను చేసిన తప్పు ఏముంది? ఇలా నన్ను అసలు గౌరవించని వ్యక్తితో జీవితం పంచుకోవడం నాకు అవసరమా? ఈ సమస్యకు పరిష్కారం తెలపండి.

NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.


End of Article

You may also like