ఇటీవల కాలం లో ప్రేమ వివాహాలు ఎక్కువ గానే జరుగుతున్నాయి. ఐతే.. కన్న వారికి ఇష్టం లేకుండా బలవంతం గా పిల్లలు చేసుకునే వివాహాలే కొంత బాధ కలిగిస్తూ ఉంటాయి. తాజాగా.. అలాంటి ఘటనే కాకినాడ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. ఓ కూతురు కులాంతర వివాహం చేసుకోవడం తో.. ఆమె తల్లి తండ్రులు పడుతున్న వేదన చూసి స్థానికులు కలత చెందుతున్నారు.

kakinada 1

ఇక వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కు చెందిన ఓ అమ్మాయి.. కాకినాడకు చెందిన అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీరిద్దరూ వేరే కులానికి చెందిన వారు కావడం తో.. వీరిద్దరికి పెళ్లి చేయడానికి అమ్మాయి తరపు తల్లితండ్రులు నిరాకరించారు. దీనితో వారిద్దరూ తల్లితండ్రులకు చెప్పకుండానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

kakinada 2

నలభై రోజుల క్రితమే వారు కాకినాడ  రిజిస్ట్రార్ ఆఫీస్ లో తమ వివాహం కోసం బుక్ చేసుకున్నారు. తాజాగా.. అనుకున్న తేదీ రాగానే.. ఇంట్లో చెప్పకుండా అక్కడకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఈ విషయం అమ్మాయి తల్లితండ్రులకు తెలియడం తో వెంటనే అక్కడకు చేరుకున్నారు. నవమాసాలు మోసి, కని, పెంచితే.. నీకు ఏది కావాలంటే అది ఇస్తే.. అవన్నీ మర్చిపోయి ఇంత మోసం చేస్తావా..? అంటూ ఆ అమ్మాయి తల్లి గుండెలవిసేలా రోదిస్తూ.. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

kakinada 3

దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చుట్టూ పక్కల వారు కూడా పోగుబడి వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత రద్దీ లో కూడా.. ఆ అబ్బాయి చాకచక్యం గా ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్లిపోయాడు. బయట అతని స్నేహితులు కారు తో సిద్ధం గా ఉన్నారు. వెంటనే ఆ కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ కారు వెనకాలే తల్లి తండ్రులు కూడా పరిగెత్తారు కానీ.. వారిని అందుకోలేకపోయారు. వారు పడుతున్న వేదన చూస్తుంటే.. ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.