Home News అంత అందమైన భార్య దొరికితే.. కాపురం చేసుకోకుండా పాడు పని చేసిన భర్త.. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారో?

అంత అందమైన భార్య దొరికితే.. కాపురం చేసుకోకుండా పాడు పని చేసిన భర్త.. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారో?

by Anudeep

Ads

పెళ్లి చేసుకునే అబ్బాయిల్లో చాలా మంది తమకు కాబోయే భార్య అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చాలా మంది కేవలం అందానికే ప్రాముఖ్యత ఇవ్వక పోయినా.. అందమైన భార్య వస్తే మాత్రం మురిసిపోతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం భార్య అందంగా ఉందని అనుమానంతో వేధించాడు. అంతటితో ఆగలేదు ఘోరంగా చంపేశాడు.

Video Advertisement

kanth rja 3

ఆ చంపడానికి ముందు సినిమాటిక్ లెవల్లో ఈ ప్రబుద్ధుడు చేసిన ప్రయత్నాల గురించి విన్నాక పోలీసులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర్ కు చెందిన కాంత్ రాజ్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం రూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వరకు వీరి కాపురం బాగానే నడిచింది. అయితే అందగత్తె అయిన భార్యని చూస్తే కాంత్ రాజ్ కు అనుమానం వచ్చేది.

kanth rja 2

ఫైనాన్స్ వ్యాపారం చేసే కాంత్ రాజ్ భార్యపై అనుమానాన్ని, పగని పెంచుకున్నాడు. పైకి ఏమి ఎరగనట్లే నటిస్తూ.. ఎక్కువ సేపు ఇంట్లోనే సమయం గడుపుతూ ఉండేవాడు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందేమో అన్న అనుమానంతో మనసులో రగిలిపోయేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమెను చంపేయాలనుకున్నాడు. అందుకోసం సినిమాలను ప్రేరణగా తీసుకున్నాడు. రెండు కన్నడ సినిమాలను చూసి.. ఆ సినిమాల్లోలాగా ఆమెను హతమార్చాలి అనుకున్నాడు.

kanth rja 1

తన భార్యను ఓ విహారయాత్రకు తీసుకెళ్లి అక్కడ కొండలమీద నుంచి ఎవరికీ అనుమానం రాకుండా తోసేయాలి అనుకున్నాడు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అలాగే.. కార్ లో తన భార్య ప్రయాణిస్తూ ఉన్నపుడు.. మరో కార్ తో గుద్దుకుని ఆమె మరణించేలా చేయాలనుకున్నాడు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఇక ఇలా కాదు అనుకుని.. నట్టింట్లోనే కూరగాయలు కోసే కత్తితో తన భార్య గొంతుకోశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత డోర్ ని లాక్ చేసుకుని పరారయ్యాడు. పోలిసుల విచారణలో ఈ నిజాలు తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు.


End of Article

You may also like