Ads
సాధారణం గా పదేళ్ల వయసులోపు పిల్లలకు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. కొంత ఊహ తెలుస్తూ ఉండడం.. ఇంకా విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం వీరిని ఆకతాయి పనులు చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాలమీదకు కూడా తీసుకొస్తూ ఉంటుంది. అయితే.. ఇలాంటి ఆకతాయి పని చేసిన చైనా లోని ఓ కుర్రాడు తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.
Video Advertisement
న్యూస్ 18 కధనం ప్రకారం, చైనా కు చెందిన జియావో హి (అసలు పేరు కాదు) అనే పదమూడేళ్ల కుర్రాడు మూత్రం ఎక్కడ నుంచి వస్తోందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమం లో పురుషాంగం లోకి లోహపు తీగను పంపించి ట్రాక్ చేద్దామని అనుకున్నాడట. అందుకోసం ఓ పొడవాటి వైరు ను తెచ్చుకుని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు. ఆ వైరుని పురుషాంగం లోపలకి పంపించే ప్రయత్నం చేసాడు.
అయితే.. ఈ ప్రయత్నం లో ఆ వైరు లోపలే ఇరుక్కుపోయింది. దీనితో ఏమి చేయాలో తెలియక కంగారు పడ్డాడు. వైరు బయటకు రాకపోయినా అతను ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే గత నెలలో అతని మూత్రం నుంచి రక్తం వస్తోందని గమనించిన తల్లితండ్రులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దక్షిణ చైనా డాంగ్‌గువాన్ ప్రాంతంలో సాంగ్‌షాన్ లేక్ సెంట్రల్ హాస్పిటల్ లో వైద్యులు ఆ బాలుడికి శస్త్ర చికిత్స చేసి సిస్టోస్కోప్ అనే పరికరం ద్వారా ఆ పొడవాటి వైరుని తొలగించారు. గంట సేపు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారట. ఈ వైరు దాదాపు 70 సెంటీమీటర్ల పొడవు ఉందట. ఆ బాలుడు దాదాపు 3 నెలలు గా ఆ వైర్ గురించి ఎవరికీ చెప్పలేదట.
End of Article