Ads
ఈరోజుల్లో చాలా మంది తమకు ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారు. గతం లో అయితే ఆడపిల్ల పుడితే అమ్మో ఆడపిల్ల పుట్టింది అనుకునేవారు కానీ.. ప్రస్తుతం కొంత మార్పు కనిపిస్తోంది. అయితే.. ఎంత అభివృద్ధి చెందుతున్నా కానీ కొందరు ఆడపిల్లలు పుట్టగానే భారం గా భావిస్తున్నారు. ఖర్చు ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని తెగ సంబరపడిపోయారు. అంతే కాదు ఆ సంబరాన్ని ఊరంతా పంచుకున్నాడు.
Video Advertisement
సిద్దిపేట జిల్లాలో నంగనూర్ మండలానికి చెందిన ఖానాపూర్ నివాసి మరబోయిన నవీన్ కు కూతురు పుట్టింది. ఆడపిల్ల పుట్టినందుకు నవీన్ మహా సంబర పడ్డాడు. తన సంతోషాన్ని పంచుకోవడం కోసం.. వాన్ నిండా రకరకాల కూరగాయలు తెప్పించి ఊరంతా పంచాడు. గ్రామం లో ఉన్న 300 ల ఇళ్లల్లో కనీసం నాలుగురోజుల పాటు కూరలు సరిపోయేలా పంచిపెట్టాడు. ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వారందరికీ.. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అంటూ సంబరం గా చెప్పుకొచ్చాడు. గ్రామస్తులంతా సంతోషించి వారిద్దరిని దీవించారు.
End of Article