ఇటీవల వచ్చిన తమిళ అనువాద చిత్రం లవ్ టుడే చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనకి తెల్సిందే. ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టు తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో అలరించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం యువత ఎలా ఉంది? ప్రేమలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చక్కగా చూపించారు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఇందులో ఆయనే హీరోగా నటించారు. హీరోయిన్ గా ఇవానా నటించింది.

Video Advertisement

ఈ చిత్రాన్ని అదే పేరుతో దిల్ రాజు తెలుగులోకి డబ్ చేశారు. తెలుగులోనూ విడుదల అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది లవ్ టుడే. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ తండ్రి చెప్పినట్టుగా ప్రేమికులిద్దరూ సెల్ ఫోన్ లు మార్చుకొని, వివాదాలకు పోయి చివరికి అర్థం చేసుకొని మళ్లీ ఒకటవుతారు. అప్పటివరకు ఇద్దరూ ఒకరికొకరు పారదర్శకంగానే ఉంటున్నామన్న భ్రమలోంచి బయటికి వచ్చి రక రకాల బావోద్వేగాలకి, గొడవలకి దిగుతారు. అయితే ఐడియా చాలా కేజ్రీ గా ఉందని నిజ జీవితం లో ఓ జంట దాన్నే ఫాలో అయ్యారు. చివరికి వారికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది ఈ ఐడియా.

couple tries famous movie idea.. got a twist at the end..

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని బేలూరు కు చెందిన అరవింద్ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే టౌన్ కు చెందిన ఒక యువతి తో కొద్ది నెలల క్రితం అరవింద్ కు నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పటినుంచి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు కలుసుకున్నారు.. ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత, ఫోన్లు మార్చుకోవాలని భావించారు. అలా మార్చుకునే ముందు ఫోన్లో పర్సనల్ డేటా ఎవరూ కూడా డిలీట్ చేయలేదు.. ఒకరి ఫోన్లో ఒకరు మార్చుకొని వెళ్లిపోయారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చెక్ చేసుకున్నారు.

couple tries famous movie idea.. got a twist at the end..

అప్పుడు అసలు కథ మొదలైంది.. అరవింద్ ఫోన్ చెక్ చేస్తుండగా ఆ యువతికి కొన్ని అసభ్యకర వీడియోలు కనిపించాయి. ఒక బాలికపై సంబంధించిన వీడియో అది. దీంతో ఆ యువతి షాక్ అయ్యింది. వెంటనే ఈ విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పడంతో వారి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకున్నారు. తర్వాత ఆ యువతీ ఆ వీడియో ఎవరిదో తెలుసుకొని వారి కుటుంబీకులను కలిసి విషయం అంతా చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.