చనిపోయాక కూడా ఫ్రెండ్ ని కలవడం కోసం సీక్రెట్ వర్డ్..? వైరల్ అవుతున్న చెక్ లిస్ట్.. అసలు కథ ఏంటంటే..?

చనిపోయాక కూడా ఫ్రెండ్ ని కలవడం కోసం సీక్రెట్ వర్డ్..? వైరల్ అవుతున్న చెక్ లిస్ట్.. అసలు కథ ఏంటంటే..?

by Anudeep

Ads

మనకు బాగా ఇష్టమైన వారు ఉన్నట్లుండి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం గా ఉంటుంది. అందులోను ప్రాణ స్నేహితులు దూరమైతే.. నరకం అనుభవిస్తాం. అయితే.. చనిపోయిన స్నేహితులు ఆత్మలుగా మారాక మనల్ని చూస్తారా? మనకు ఏమైనా చెప్పాలని అనుకుంటారా..? అన్నవి ఇప్పటివరకు సందేహాలుగానే మిగిలిపోయాయి. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ చెక్ లిస్ట్ మాత్రం కొత్త కథను చెబుతోంది.

Video Advertisement

best friend died 1

ఈ చెక్ లిస్ట్ ఓ చనిపోయిన వ్యక్తి బతికున్నప్పుడు రాసి పెట్టుకున్నది. మనం బతికి ఉన్నప్పుడు ఏ పనులు చేసుకోవాలో చెక్-లిస్ట్ ను పెట్టుకుంటాం కదా.. అలాగే.. ఈ వ్యక్తి తాను చనిపోయాక తన స్నేహితుడు చేయాల్సిన పనులను ఓ చెక్ లిస్ట్ గా రాసి పెట్టుకున్నాడు. అది తన స్నేహితుడికి ఇచ్చాడు. “ఆఫ్టర్ డెత్ చెక్‌లిస్ట్ ఫర్ బెస్ట్ ఫ్రెండ్” అనే టైటిల్ తో ఉన్న ఈ చెక్ లిస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

After-Death check list for best friend

ఈ చెక్ లిస్ట్ లో ఈ వ్యక్తి ఐదు పనులను తన స్నేహితుడికి అప్పగించాడు.

#1. బ్రౌజర్ హిస్టరీ ని డిలీట్ చేయడం.

#2. “తాను శవపేటిక లో ఉన్నా”.. అని చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం.

#3. సీక్రెట్ వర్డ్ ని మర్చిపోవద్దు. ఆత్మలు నిజంగానే ఉంటె.. ఆ వర్డ్స్ నీకు నా ఉనికిని తెలియచేస్తూ ఉంటాయి.

#4. నేను ఇష్టపడని వ్యక్తి ఎవరో అతనికి “అతనంటే నాకు అస్సలు ఇష్టం లేదు” అని చెప్పండి.

#5. నన్ను గుర్తుపెట్టుకో..

After-Death check list for best friend

ఈ ఐదు పాయింట్స్ ను సదరు వ్యక్తి చెక్-లిస్ట్ లో పెట్టాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ని చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ తనకు ఇలాంటి అనుభవం ఉందని చెప్పుకొచ్చింది. తన స్నేహితురాలు కూడా ఇలానే సీక్రెట్ వర్డ్ ను కోడ్ గా ఇచ్చిందని.. ఆ వర్డ్ ఎప్పుడైనా వినపడితే అది తానేనని నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది. తనకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ నేను ఆ కోడ్ వర్డ్ ని ఎవరితోనూ పంచుకోలేదని చెప్పుకొచ్చింది. తన ఉనికి నాకు తెలుస్తూనే ఉంటుందని, మా కమ్యూనికేషన్ ను ఎప్పటికి ఆపమని ఆమె చెప్పుకొచ్చింది.


End of Article

You may also like