కూతురి జ్ఞాపకార్థం పదేళ్ల నుండి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న హైదరాబాదీ.! హ్యాట్సాఫ్ భాయ్.!!!

కూతురి జ్ఞాపకార్థం పదేళ్ల నుండి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న హైదరాబాదీ.! హ్యాట్సాఫ్ భాయ్.!!!

by Mohana Priya

Ads

మనిషికి కనీస అవసరాలు ఉండటానికి ఇల్లు, ఆహారం, బట్టలు. ఒక మనిషి ఎంత కష్టపడినా కూడా వీటి కోసమే. మనిషికి మనిషే సహాయం చేస్తారు అని అంటారు. ఎంతో మంది వ్యక్తులు ఇతరులకి కనీస అవసరాలు కూడా లేనప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఆహారం. అలా ఒక వ్యక్తి గత పది సంవత్సరాల నుండి ఎంతో మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.

Video Advertisement

source : ANI

ఆయన పేరు మొహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సోహైల్. హైదరాబాద్ కు చెందిన ఆసిఫ్ హుస్సేన్ సోహైల్, తన తండ్రి అఫ్జల్ హుస్సేన్, కూతురు సకినా, జ్ఞాపకార్థం 2010 లో సకినా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ సమయంలో, మూడు నెలల పాటు ఎన్నో వేల మందికి డైలీ బేసిస్ మీద భోజనానికి అవసరమయ్యే పదార్థాలని, భోజనాన్ని అందించారు.

source : ANI

హైదరాబాద్ ని నాలుగు జోన్లుగా డివైడ్ చేసి అనేక ఏరియాలలో కిచెన్స్ ఏర్పాటు చేశారు. అలా చాలా మందికి ఆహారం అందుబాటులో ఉండేలా చేశారు. ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ కుటుంబ సభ్యులు కూడా ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

source : ANI

ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల సమయంలో ఆహారాన్ని అందిస్తున్నారు. జాతి, కులం, మతం లాంటి ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఆహారాన్ని ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేసి, ఆ ప్యాకెట్స్ అన్నిటినీ ఒక చోట పెడతారు. వాటి నుండి ఎంతమందికి ఎంత ఆహారం కావాలో చూసుకొని తీసుకోవచ్చు.

source : ANI

ఆహారంతో పాటు మాస్క్ లేని వారికి మాస్క్ లను కూడా అందిస్తున్నారు. అలాగే స్లమ్ ఏరియాస్ లో కోవిడ్ 19 గురించి అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ లోని వెస్ట్ జోన్ ఏరియాలో వేలాది మంది వలస కూలీలకు భోజనం మరియు రాత్రిపూట ఆహారం (డిన్నర్) అందించినందుకు ఆసిఫ్ హుస్సేన్ సోహైల్, వెస్ట్ జోన్ కమిషనర్ ఎ.ఆర్.శ్రీనివాస్ నుండి లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ అందుకున్నారు.

watch video :


End of Article

You may also like