Ads
పూర్వకాలం నుంచి వంటల విషయంలో మగవారి పదం ఎక్కువగా వింటూ ఉంటున్నాం. ఉదాహరణకు నలభీమపాకం అని పురుషులు తమ వంటల గురించి గొప్పగా చెప్పుకుంటారు.
Video Advertisement
మన అమ్మమ్మల కాలం నాటిలో మన ఆడవారు ఎటువంటి వంట అయినా రుచిగా సూచిగా చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పటి తరం వారు చాలామట్టుకు వంటల విషయంలో అవగాహన తక్కువ అని చెప్పవచ్చు. చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా వంట గదుల కు దూరంగా ఉంటున్నారు నేటితరం. ఇప్పుడు అలాంటి ఒక విషయమే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. పెళ్లి చూపులు నిమిత్తం అమ్మాయి ఇంటికి వెళ్లిన అబ్బాయికి ఎదురైన సంఘటన ఇది.
ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేశాడు. మీకు 28 సంవత్సరాల వయస్సు, మీరు భారతదేశంలో పుట్టి పెరిగారు. మీ తల్లిదండ్రులతో కలిసి పెళ్లిచూపుల నిమిత్తం అమ్మాయిని చూడడానికి వెళ్తారు. మీకు కాస్త ఆకలిగా ఉంది. అమ్మాయి కుటుంబ సభ్యులు మా అమ్మాయి బాగా వంట చేస్తుందని చెబుతారు. నాకోసం ఒక దోశ వెయ్యమని చెప్పగా, తప్పకుండా అని వంటగదిలోకి వెళ్లి ఈ విధంగా దోశ వేసి తీసుకొచ్చింది. ఆ దోశను ఇప్పుడు నేను తిన్నాలో లేదో మీరే చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు. అతను చేసిన ఈ ట్వీట్ కి అనేక సమాధానాల్లో కామెంట్లు వచ్చి పడ్డాయి. ఇచ్చిన సమాధానాలు ఏంటో మనం కూడా ఒకసారి చూసేద్దాం రండి.
ఒకరైతే నాకు వంట రాదు అంటూ ఆ దోస ద్వారా మాటలతో చెప్పకుండానే నీకు సమాధానం ఇచ్చిందని. ఆమె స్పష్టంగా తెలియజేసింది మిమ్మల్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని, మీరు వెతుకుతున్నది అమ్మాయి కోసమా లేక వంట కోసమా అంటూ…, ఆ అమ్మాయి వేసేది దోశ పై తీర్పు చెప్పే తెలివి నీకు ఉందా అంటూ రకరకాలుగా సమాధానాలు వచ్చాయి
End of Article