ఈ కరోనా గడ్డుకాలం మనుషుల్లో మానవత్వాన్ని మిగలనివ్వకుండా చేస్తోంది. ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు వైద్యుల్లో మానవత్వం వెల్లివిరుస్తోంది. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిసినా వీరు వెనకాడక కరోనా రోగులకు సేవ చేస్తున్నారు. రోజు పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమం లో వీరి అవిశ్రాంతం గా పని చేస్తున్నారు.

surath nurse

గుజరాత్ లో సూరత్ కు చెందిన అయేజా మిస్త్రీ అనే ఓ నర్స్ కూడా ఇలాంటి కోవకే వస్తారు. ఆమె నాలుగు నెలల గర్భవతి. ముస్లిం.. రంజాన్ నేపధ్యం లో ఆమె ఉపవాస దీక్షను కూడా పాటిస్తోంది. సాధారణం గానే గర్భిణీ లు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆమె గర్భం తో ఉండీ.. ఉపవాసం చేస్తూ.. నర్స్ గా తన విధులను తానూ నిర్వర్తిస్తోంది. అక్కడ సమీపం లోని అటల్ కోవిద్ సెంటర్ లో ప్రతి రోజు 8 నుంచి 10 గంటల వరకు ఆమె తన సేవలను అందిస్తోంది.

nurse

గర్భిణులకు ఉపవాస దీక్ష చాలా కష్టమైనది. ఆమె గంటల తరబడి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాస దీక్ష పాటిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయం లోను ఆమె తన సేవల్ని అందించారు. ప్రస్తుత పరిస్థితి గురించి ఆమెని అడగ్గా… తాను గతం లోను సేవలందించానని..ఈసారి మాత్రం కడుపులో బిడ్డ పెరుగుతోందని.. దేవుని దయ వలన రంజాన్ మాసం లో సేవ చేసే అదృష్టం లభించిందని.. చెప్పుకొచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారంతా నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తున్నారని.. వారి దీవెనలే రక్షిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.