నాగార్జున నెక్స్ట్ సినిమా కి పెద్ద చిక్కే వచ్చి పడిందిగా..!

నాగార్జున నెక్స్ట్ సినిమా కి పెద్ద చిక్కే వచ్చి పడిందిగా..!

by Anudeep

Ads

కింగ్ నాగార్జున ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహం తో పనులు చేసుకుంటూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, నాగార్జున కు ఈ ఏడాది విజయం దక్కలేదు. ఆయన నటించిన వైల్డ్ డాగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ.. ఎందుకనో ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆడలేదు. మరో వైపు.. ఈ సినిమా తరువాత నాగార్జున ప్రవీణ్ సత్తారు తో కలిసి కొత్త ఆక్షన్ సినిమా ను ప్రకటించారు.

Video Advertisement

nagarjuna

ఈ సినిమా కొంత షూటింగ్ షెడ్యూల్ ను ఇటీవలే గోవా లో పూర్తి చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ లో వచ్చిన అవుట్ పుట్ నాగార్జున కు నచ్చకపోవడం తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమం లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోయే బంగార్రాజు ప్రీ-ప్రొడక్షన్ పనిలో నాగ్ పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి బెడద ముగిసాక.. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.


End of Article

You may also like