పెళ్లి కూతుర్లు పెళ్ళిలో ఇలా చేయడాన్ని మీరు సమర్థిస్తారా..? విమర్శిస్తారా..? ఈ వ్యక్తి చెప్పిన సమాధానం కరెక్టేనా..?

పెళ్లి కూతుర్లు పెళ్ళిలో ఇలా చేయడాన్ని మీరు సమర్థిస్తారా..? విమర్శిస్తారా..? ఈ వ్యక్తి చెప్పిన సమాధానం కరెక్టేనా..?

by kavitha

Ads

పెళ్లంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతుంటారు. ఎవరి జీవితంలో అయిన మరుపురాని వేడుక. అందుకే పెళ్ళిని అపురూపమైన వేడుకగా జరుపుకుంటారు. భారతీయ వివాహ వేడుకల్లో నూతన వధూవరులకు స్వాగతం చెప్తూ బంధువులు చేసే బరాత్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

Video Advertisement

డప్పు చప్పుళ్ల, డీజే సౌండ్లు మధ్య తీసే బరాత్, కొత్త జంటకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒకప్పుడు సిగ్గుపడుతూ ఉండే పెళ్లికూతురు, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కు, ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం. అవి నెట్టింట్లో వైరల్ అవడం కామన్ గా మారింది. కోరాలో ఈ విషయం పై అడిగిన ప్రశ్నకు ఓ యూజర్ ఇచ్చిన జవాబు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కోరాలో “ఈ కాలంలో (కలికాలం) పెళ్లి కూతుర్లు సిగ్గు పడడం మానేసి పెళ్ళిలో ఐటం సాంగ్ లకు డాన్స్ లు చేయడాన్ని మీరు సమర్థిస్తారా విమర్శిస్తారా? ఎందుకు? అనే ప్రశ్నకు దుర్గా ప్రసాద్ తూము అనే యూజర్ ఇలా చెప్పుకొచ్చాడు. ” నేనైతే సమర్ధించను, అలాగని విమర్శించను. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్తాను. ఈ పెళ్ళిళ్ళలో హల్దీ లు,బారాత్ లు చూసినప్పుడల్లా మనుషులు కృత్రిమంగా అనిపిస్తారు. కేవలం సినిమాలో ఒక హీరో చేసాడనో, హీరోయిన్ చేసిందనే ఆ క్రేజ్ తో పెళ్ళిళ్ళలో అవే పాటలు అవన్నీ పెట్టుకుని, నృత్యం చేయడం చూస్తుంటే చాలా అసహజంగా అనిపిస్తుంది నా వరకైతే.
ఒకప్పుడు పసుపు కొట్టే పండుగ అనేది, మన దగ్గర చాలా గుంభనంగా జరిగేది. మరీ ముఖ్యమైన బంధువులు మాత్రమే, అలా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి కొడుకు/ పెళ్లి కూతురు పొట్ట పై రోకలి తో చిన్నగా కొట్టేవారు. పసుపు తీసి, మంగళ స్నానాలు చేయించేవారు.. ఇప్పుడు మాత్రం మనవాళ్ళు ఉత్తరాది వారి హల్దీ ఎరువు తెచ్చుకుని,ఒకరి మీద ఒకరు పసుపు జల్లుకుంటూ, రెయిన్ డ్యాన్స్ లు. సంప్రదాయం కన్నా, రీల్స్ కి , సెల్ఫీ లకే ఇప్పుడు ప్రధానం. ఇది ట్రెండ్ అనుకుని పెద్దగా మనసుకి తీసుకుకుంటే మంచిది.
కానీ ఈ కృత్రిమత్వమే సహజం అనుకునే స్థాయి వచ్చేసింది ఈ సమాజంలోకి, ముఖ్యంగా జనరేషన్ జెడ్ (2000 తర్వాత జన్మించిన వారు) ఈ సెల్ఫీలకి రీల్స్ కి బాగా అలవాటు పడ్డారు. వారిని చూసి, వారిలా చేయకపోతే మనల్ని ఎక్కడ ముసలివాళ్ళు అనుకుంటారో అనో, బాగుందనో అంతకు ముందు తరాల వారు కూడా ఈ ట్రెండ్ ని అనుసరిస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటో షూట్,ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ ఇలా ఏవి తీసుకోండి, బాగుపడేది లక్షల్లో ప్యాకేజీలు అందుకునేది కేవలం ఫొటోగ్రాఫర్లు మాత్రమే.
అందుకోసం వారు చెప్పిన పిచ్చి చేష్టలు, వెకిలి వేషాలు, గోడ అంచున నిలబడి సాహసాలు, అబ్బో కృత్రిమత్వానికి పరాకాష్ట. ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి , ఇన్ని సాహసాలు చేసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు పోనీ సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటారా అంటే, ఎబ్బే. ఇక మీరు అమ్మాయిలకి సిగ్గు లేదా అని అడిగారు, అది తప్పు. అబ్బాయిలు కూడా అదే బారాత్ అనే కార్యక్రమంలో డాన్స్ లు చేస్తున్నారు కదా, వీరికి సిగ్గు లేదంటే, వారికీ లేనట్టే కదా. వారి పెళ్ళిలో వారు డ్యాన్స్ చేస్తారో, ఫైట్ చేస్తారో వారి ఇష్టం అని వదిలేయడం ఉత్తమం. కాబట్టి జడ్జ్ చేయడం మానేయండి.
మీకు వీలైతే అలంటి ఫంక్షన్స్ కి దూరంగా ఉండడం, ఆ తరహా నృత్యాలు ఉన్న వీడియోస్ చూడడం మానేయండి. ఎవరికీ నచ్చిన పని వారు చేసుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది అన్న సంగతి మరువకూడదు. అలాగే అలంటి కార్యక్రమాలకి దూరంగా ఉండే హక్కు కూడా అందరికీ ఉంది. అది గుర్తించుకుంటే మనశ్శాంతికి లోటుండదు. సర్వేజనా సుఖినోభవంతు” అంటూ దుర్గా ప్రసాద్ తూము రాసుకొచ్చారు.

Also Read: సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు భయపడుతున్నారా..? ఈ ప్రశ్నకి ఒక నెటిజన్ ఏం సమాధానం ఇచ్చారంటే..?

 


End of Article

You may also like