వీళ్లేంటి ఇంత అతి చేస్తున్నారు..? వైరల్ అవుతున్న ఈ “సీరియల్” సీన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

వీళ్లేంటి ఇంత అతి చేస్తున్నారు..? వైరల్ అవుతున్న ఈ “సీరియల్” సీన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

by Anudeep

Ads

ఒక్కోసారి సీరియల్ వాళ్ళు చేసే అతి చూస్తే నవ్వు ఆగదు. అసలు ఎందుకు అలాంటి సన్నివేశాలను  చేస్తారో వాళ్ళ కైనా అర్థమవుతుందా అనిపిస్తుంది.

Video Advertisement

సీరియల్ లో చేసే అతికి చూసే ప్రేక్షకుల మతి పోతుంది. వాళ్ల నటన వెండితెర నటుల నటనను మించి ఉంటుందని చెప్పవచ్చు.

ఈ మధ్య కలర్స్ టీవీలో  రిలీజ్ అయి పాపులర్ అయిన స్వర్ణ ఘర్ హిందీ సీరియల్ లోని ఒక ఎపిసోడ్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. మిలియన్స్ అఫ్ వ్యూస్ తో విచిత్రమైన కామెంట్లు వెలువడుతున్నాయి. ఫ్యాన్ లో మెడకు ఉన్న దుపట్టా ఇరుక్కున్న ఈ ఎపిసోడ్ లో పక్కన ఉన్న వారు  చేసినా హంగామా కొంచెం అతిగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. స్లో మోషన్ లో నాటకీయంగా ప్లే చేయబడిన అస్తవ్యస్తమైన ఈ సన్నివేశాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

అసలు విషయానికి వస్తే స్వర్ణ ఘర్ లో ప్రచారమైన  ఒక ఎపిసోడ్ లోని భార్య మెడకు ఉన్న దుపట్టా ఫ్యాన్ లో ఇరుక్కుంటుంది. భార్యని రక్షించడానికి భర్త పడే అవస్థను చూస్తూ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. భర్త తప్ప ఏ ఒక్కరు రక్షించడానికి దగ్గరికి వెళ్ళారు. ఫ్యాన్ ప్లగ్ ని తీయడానికి ప్రయత్నిస్తే, అదేదో ఫెవికాల్ అతికించినట్లు ఎంతకీ రాదు. ఈ లోపు హీరోయిన్ మెడ బిగిసుకొని ప్రాణాపాయ స్థితిలో కి వెళ్ళిపోతుంది. రెండు నిముషాలు పాటు  ఆగకుండా సాగిన ఈ సన్నివేశం ప్రేక్షకులను భయాందోళనకు గురిచేస్తుంది. దుపట్టా ఎంతసేపటికీ రాకపోవడంతో భర్త నోటితో చింపి ఆమెను రక్షిస్తాడు.

ఇలా చేయడం అవసరమా రెండో వైపు ఉన్న దుపట్టాని వదులు చేయిస్తే సరిపోతుంది కదా అని నెటిజన్లు హాస్యాస్పదమైన కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

watch video :


End of Article

You may also like