Ads
కరోనా వల్ల ఎక్కడికి కదలలేని పరిస్థితి రావడంతో ఒక చెల్లెలు తన అన్నకి రాఖీ పంపుతూ ఇలా రాసింది.
అన్నా. ఎలా ఉన్నావ్? ఈసారి నేను నీకు డైరెక్ట్ గా కలిసి రాఖీ కట్టలేను. ఇక్కడ పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. చాలామంది ఏదో ఒక లాగా వాళ్ల ఇళ్ల కి వెళ్తున్నారు. నేను కూడా అలాగే వద్దాం అనుకున్నా. కానీ మా ఏరియా రెడ్ జోన్ చేశారు.
Video Advertisement
ఒకవేళ నేను వచ్చినా కూడా నన్ను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచి గాని ఇంటికి పంపరు. అప్పటికి రాఖీ పండుగ కూడా అయిపోతుంది. అందుకనే రావట్లేదు. రాఖీ కొరియర్ చేశా. ఈసారికి అమ్మతో కట్టించుకో. నేను వచ్చి కట్టలేదు అని చెప్పి నా గిఫ్ట్ ఎగ్గొడితే మాత్రం బాగోదు. హ్యాపీ రాఖీ.
ఇలా ఎంతో మంది సోదరీ సోదరులు ఈసారి రాఖి కలిసి జరుపుకోలేకపోవచ్చు. ఎంతోమంది తమ సోదరులకు రాఖీ కట్టలేకపోతున్నామని, తమ అక్క/ చెల్లెలి చేత రాఖీ కట్టించుకోలేకపోతున్నామని ఎంతో మంది సోదరులు బాధపడొచ్చు.
కానీ ప్రస్తుతం ఆరోగ్యం కాపాడుకోవటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. రాఖీ పండగ వచ్చే ఏడాది వస్తుంది. కానీ ఒకవేళ మనం తొందరపాటులో ఇప్పుడు వేరే చోట్ల కి ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తే అవి ఎంత దూరం వెళ్తాయో ఊహించలేం. కాబట్టి ఈ సంవత్సరానికి ఇలా కానిచ్చేద్దాం. వచ్చే ఏడాది పరిస్థితులన్నీ సర్దుకుని అందరూ తమతమ కుటుంబ సభ్యులని ఆనందంగా కలవాలి అని ఆశిద్దాం.
End of Article