Ads
ప్రస్తుతం కరోనా కారణం గా అనే రెస్ట్రిక్షన్స్ మధ్యన జీవించాల్సి వస్తోంది. నిత్యావసరాల కోసం మాత్రం కొంత సేపటి వరకు షాపులకు అనుమతిస్తున్నారు. ఆ తరువాత లాక్ డౌన్ నియమాల ప్రకారం అందరు ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితి లో మద్యం బాబులకు కూడా ఇక్కట్లు తప్పడం లేదు. గతం లో కంటే తక్కువ గా మద్యం దొరుకుతోంది.
Video Advertisement
ఇదే పరిస్థితి బెంగళూరు లో ఓ వ్యక్తి కూడా ఎదురైంది. మాండ్య నివాసి, సునీల్ బిపి యలహంకలోని శ్రీనివాస బార్లో వెయిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బార్‌లోని ఇతర సిబ్బందితో పాటు అదే భవనంలో నివసిస్తున్నాడు. మంగళవారం (మే 25) రాత్రి 7:30 గంటల సమయంలో, అతను ఆన్లైన్లో వచ్చిన ఫుడ్ ఆర్డర్ ను డెలివర్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయం లో కూరగాయలను అమ్మే వ్యక్తి రిజ్వాన్ (24) విస్కీ బాటిల్ కోసం సునీల్‌ను సంప్రదించాడు. అయితే లాక్ డౌన్ టైం లో అమ్మకం జరిపితే.. బార్ ను మూసివేసే అవకాశం ఉన్నందున మందు అమ్మడానికి సునీల్ ఒప్పుకోలేదు. దీనితో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఈ సమయం లోనే రిజ్వాన్ వంట గదిలోని కట్టి తీసుకుని సునీల్ పై దాడి చేసాడు. సునీల్ కుడి చేతి కి గాయం అయింది. దీనితో బార్ సిబ్బంది సహా చుట్టుపక్కల వారు పోగుబడ్డారు. అక్కడివారు ఆ వ్యక్తిని అదుపు చేసి పోలీసులకు అప్పగించారు. రిజ్వాన్ పై కేసు నమోదైంది.
End of Article