Ads
భార్యాభర్తలు అన్నాకా.. వారి మధ్య సవాలక్ష రహస్యాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య దాపరికాలు ఉండడం మంచిది కాదు. అలానే.. వారి మధ్య ఉన్న రహస్యాలను కూడా ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు. చాలా మందికి తమ జీవిత భాగస్వామి తమ స్వంత విషయాలను ఇతరులతో పంచుకుంటే సహించలేరు.
Video Advertisement
ఈ అమ్మాయి సమస్య కూడా అలాంటిదే. సాధారణంగా గొడవలైనా, చిన్న చిన్న సర్దుబాట్లయినా అవి భార్యాభర్తల మధ్య ఉన్నంత వరకే బాగుంటాయి. వారి రహస్యాలు మూడవ వ్యక్తికి చేరితే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
తన భర్త అన్ని విషయాలను తన తల్లితో చెప్పడం ఇష్టం లేని ఓ అమ్మాయి ఇలా లేఖ రాసింది. ఆ అమ్మాయి సమస్యకి తగిన పరిష్కారం చూపండి. “నా భర్త చాలా మంచి వాడు. అతనితో వచ్చిన చిక్కల్లా ప్రతి చిన్న విషయాన్నీ తన తల్లికి చేరవేస్తూ ఉంటాడు. తన తల్లికి ఏమీ చెప్పకూడదు.. దూరంగా ఉండాలి అని నా ఉద్దేశ్యం కాదు. కానీ.. నాకు సంబంధించిన రహస్యాలను చెప్పకూడదు అని నేను కోరుకోవడంలో తప్పు లేదు కదా…
ఏ విషయం గురించి మా ఇద్దరి మధ్య చర్చ జరిగినా.. దానిని అక్షరం పొల్లుపోకుండా అతని తల్లికి చెప్పేస్తూ ఉంటాడు. నేను నా తల్లి తండ్రులకు అన్ని విషయాలూ చెప్పను. ఎంతవరకు చెప్పుకోవాలో అంత వరకే చెప్పుకుంటాను. ఒక పరిధి వద్ద గీత గీసుకుంటాను. కానీ, నా భర్త అలా కాదు.. ప్రతి విషయాన్నీ నా అత్తగారితో చెబుతూ ఉంటారు. చివరకు నేను ఆవిడకు ఏదైనా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా.. ఆ విషయం అతనికి తెలిసిపోతూ ఉంటుంది.
ఏదైనా ఓ ట్రిప్ గురించి సరదాగా అనుకున్నా ఆవిడకి తెలిసిపోతుంటుంది. ఏదైనా గొడవపడ్డా ఆవిడకి క్షణాల్లో తెలుస్తుంటుంది. ఇదంతా నాకు ఎలా ఉంటుందంటే.. మా బెడ్ రూమ్ కు ఓ పీప్ హోల్ పెట్టినట్లు ఉంటుంది. ఈ విషయమై నేను అతనితో చాలా సార్లు చర్చించినా తాను అర్ధం చేసుకోలేదు. అసలు నేను చెప్పేదే అర్ధం లేని విషయంలా వాదిస్తాడు. నా బాధని తనకి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలి..? నా సమస్యకి పరిష్కారమేంటి..? అనేది తెలియచెప్పగలరు.
End of Article