Home Viral స్కూటీని ఇలా కూడా కంట్రోల్ చేస్తారా..? ఈ యువతి చేసిన పని చూస్తే పడి పడి నవ్వాల్సిందే..!

స్కూటీని ఇలా కూడా కంట్రోల్ చేస్తారా..? ఈ యువతి చేసిన పని చూస్తే పడి పడి నవ్వాల్సిందే..!

by Anudeep

బైక్ లు, స్కూటీలు నడపాలని అందరూ కోరుకుంటారు. కానీ వారికి తగిన వయసు వచ్చాక.. లైసెన్స్ టెస్టులో పాల్గొని లైసెన్స్ వచ్చాకే వాటిని ముట్టుకోవాలి. కానీ ప్రస్తుతం కొందరు తల్లి దండ్రులు పిల్లలు ముచ్చట పడ్డారనో, లేదా తక్కువ దూరాలనో వారికీ సరదాగా వాహనాలను ఇస్తున్నారు. దీంతో కొన్ని అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి.

అంతే కాకుండా రోడ్లపై బైక్ లను నడపడం అంత తేలికైన విషయం కాదు. ఎదురుగా వస్తున్న వాటిని తప్పించుకుంటూ, రోడ్డు నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని. వీటి కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇవి భయం కలిగించడమే కాకుండా కొన్ని అంతగా నష్టం కలగని ప్రమాదాలు నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

funny accident
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. స్కూటీలు నడపడం అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో మనందరికీ బాగా తెలుసు. కానీ చాలా మంది స్కూటీ నడపడంలో నిష్ణాతులు కాదు. యాక్సిలరేటర్‌ను ఎప్పుడు, ఎలా నియంత్రించాలో వారికి అంతగా అవగాహన ఉండదు. ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో లో ఓ యువతి స్కూటీలో పెట్రోల్ కొట్టించు కుంటుంది. ఆమె వెనుక స్కూటీ తో ఓ వ్యక్తి, అతనితో పాటు మరో యువతి నిలబడి ఉన్నారు.

 

funny accident

అక్కడి వరకు డ్రైవ్ చేసుకొచ్చిన ఆ వ్యక్తి స్కూటీ ని ఆ యువతీ చేతికిచ్చాడు.పెట్రోల్‌ నింపుకున్నయువతి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తున్న సమయంలో వెనుక నిలబడ్డ యువతి ఒక్కసారిగా యాక్సిలేటర్‌ను రేస్ చేసింది. దీంతో స్కూటీ అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. అలాగే పెట్రోల్ బంక్ సిబ్బంది పైకి కూడా వెళ్లడంతో అతడు నియంత్రించుకోలేక ఫిల్లింగ్ మెషిన్ మీద పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో ఇండియాస్పీక్స్ అనే ఖాతాతో పోస్ట్ అయింది. వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

watch video :

How does such people end up with a license
byu/frosted_bite inIndiaSpeaks

You may also like