Home News రెండేళ్లు గా పిల్లలతో బాత్ రూమ్ లోనే నివాసం ఉంటున్న తల్లి.. కారణం తెలిస్తే కన్నీళ్లే..!

రెండేళ్లు గా పిల్లలతో బాత్ రూమ్ లోనే నివాసం ఉంటున్న తల్లి.. కారణం తెలిస్తే కన్నీళ్లే..!

by Anudeep

ఇద్దరు చిన్న పిల్లలు.. భర్త చనిపోవడం తో వేరే ఆధారం లేదు. దీనితో ఆ తల్లికి ఏమి చెయ్యాలో పాలు పోలేదు. దాదాపు రెండేళ్ల నుంచి బాత్ రూమ్ లోనే పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. మహబూబ్​నగర్​జిల్లా బాలానగర్​ మండలం తిరుమలగిరికి చెందిన ఈ మహిళ స్టోరీ వింటే కన్నీళ్లొస్తాయి. భర్త చనిపోవడం తో కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది.

women living in bathroom

అప్పటి వరకు వారు నివాసం ఉంటున్న చిన్న పూరి గుడిసె కూడా కూలిపోవడం తో ఆ అత్తా కోడళ్ళకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. కొన్ని రోజుల పాటు పంచాయతీ కమిటీ హాలులో తల దాచుకున్నారు. కానీ ఆ తరువాత వారు కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించడం తో చేసేది లేక.. తమ ఇంటి ముందు ఉన్న బాత్ రూమ్ నే నివాసం గా మార్చుకున్నారు. అక్కడే వండుకోవడం, తినడం, పడుకోవడం చేస్తున్నారు.

women living in bathroom

v6 న్యూస్ కధనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన గుమ్మడి బాలయ్య, సుజాత లకు విన్నీ, భాను అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలయ్య తల్లి అంజమ్మ కూడా వీరితోనే కలిసి ఉండేది. ఏడేళ్ల క్రితమే బాలయ్య అనారోగ్యం తో మృతి చెందాడు. బాలయ్య చనిపోవడం తో వీరి కుటుంబం రోడ్డున పడింది. అత్తా కోడళ్ళు ఇద్దరు కూలి పనులకు వెళ్తూ పొట్ట నింపుకుంటున్నారు. ఉండడానికి ఇల్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇంటి ముందు ఉన్న బాత్ రూమ్ నే ఇల్లు గా చేసుకున్నారు. రాత్రి సమయాల్లో పిల్లలిద్దరినీ లోపల పడుకోబెట్టి.. వారు బయటే నిద్రిస్తున్నారు.

women living in bathroom

ఎండా, వాన తేడా లేకుండా వారు అక్కడే ఉండాల్సి వస్తోంది. పిల్లలను లోపల పడుకోబెట్టి అత్తా కోడళ్ళు ఇద్దరు బయటే పడుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఇప్పటికి పలుసార్లు స్థానిక పార్టీ లీడర్లు తమకు ఇల్లు ఇప్పిస్తామంటూ వాగ్దానాలు అయితే చేశారని.. ఇప్పటి వరకు తమ గోడు పట్టించుకున్న వారు ఎవరు లేరని ఆ అత్తా కోడళ్ళు వాపోతున్నారు.

Watch Video:

You may also like