Ads
బీహార్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రములోని జముయ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జముయ్ జిల్లాకు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చి తాను దుర్గామాతని అంటూ రచ్చ రచ్చ చేసింది. ఒక చేతిలో బియ్యం, మరో చేతిలో ఓ ప్రత్యేక రకమైన కర్రని పట్టుకుని ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది.
Video Advertisement
దీనితో స్థానిక పోలీస్ స్టేషన్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సికంద్రా పరిధిలోని పంచమహువా ముసహరి వద్ద కార్తీక్ మాంఝీ అనే ఓ వ్యక్తిని మద్యం కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసారు.
ప్రస్తుతం అతనిని పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే.. కార్తీక్ మాంఝీ భార్య సంజు దేవి తన భర్తని విడిపించాలంటూ డ్రామాకు తెరలేపింది. ఒక చేతిలో బియ్యం, మరో చేతిలో ఓ ప్రత్యేక రకమైన కర్రని పట్టుకుని సంజు దేవి తాను దుర్గామాతని అంటూ పోలిసుల వద్ద రచ్చ చేసింది. తన భర్తని విడిచిపెట్టేయాలని, లేకపోతే ఇక్కడున్న అందరు బాధపడతారు అంటూ ఆమె పోలీసులను హెచ్చరించింది. అయితే స్టేషన్ ఇన్‌చార్జి జితేంద్ర దేవ్ సంజు దేవితో పాటు, ఆమెతో వచ్చిన ఇతర మహిళలను కూడా పోలీస్ స్టేషన్ ఆవరణ నుంచి బయటకు పంపేశారు. పోలీసులు సంజు దేవితో ఆమె భర్త కార్తీక్ ను కస్టడీలోకి తీసుకోవడం గురించి మాట్లాడారు.
దీనితో ఆ మహిళ డ్రామాను విరమించుకుంది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. గతంలో కూడా ఆమె సంజు దేవి తనపైకి దుర్గామాత వచ్చినట్లు తమ గ్రామంలో నటిస్తూనే ఉంటుందని పోలీసులు తెలిపారు. గతంలో లచ్చువార్ గ్రామంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా మద్యం తయారవుతోందని పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అయితే ఓ మహిళ కత్తి, త్రిశూలంతో దుర్గామాత వేషంతో వారిపై దాడికి దిగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మరుసటి రోజు.. దాడి చేసిన సునీతా దేవి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసారు.
End of Article