రెండో పెళ్లి చేసుకుందని.. దారుణమైన శిక్ష విధించిన కులపెద్దలు..ఏమి జరిగిందంటే..?

రెండో పెళ్లి చేసుకుందని.. దారుణమైన శిక్ష విధించిన కులపెద్దలు..ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

కాలం మారుతోంది. పెళ్లి విషయంలో యువత అభిప్రాయాలూ మారుతూ వస్తున్నాయి. కానీ.. భారత్ లో కొన్ని కులాలు మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్ర లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర, అకోలా జిల్లా కు చెందిన ఓ మహిళకి 2011 లోనే వివాహమైంది. అయితే… నాలుగేళ్లకే గొడవల కారణం గా వాళ్ళు విడిపోయారు. తాజాగా.. 2019 లో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే.. ఇందుకు ఆమె కులం ” నాథ్ జోగి” కుల పెద్దలు అంగీకరించలేదు.

Video Advertisement

nadh jogi

ఈ పెళ్లి గురించి మాట్లాడానికి.. ఆమెను, కుటుంబ సభ్యుల్ని పిలిపించారు. రెండో పెళ్లి చేసుకోవడం మతానికి వ్యతిరేకమని.. అందుకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇందుకు శిక్ష గా ఆమె కుల పెద్దల ఉమ్మిని నాకాలని ఆదేశించారు. అంతే కాదు లక్షరూపాయల జరిమానా కూడా విధించారు. దీనితో.. సహించలేకపోయింది ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనితో వీరి గుట్టు రట్టయింది.


End of Article

You may also like