చీర కొంగు అడ్డు పెట్టి.. ఈ మహిళ ఎంత పని చేసిందంటే.. 300 సీసీ కెమెరాలలో కనిపించిన ఈ సీన్స్ చూస్తే షాక్ అవుతారు..!

చీర కొంగు అడ్డు పెట్టి.. ఈ మహిళ ఎంత పని చేసిందంటే.. 300 సీసీ కెమెరాలలో కనిపించిన ఈ సీన్స్ చూస్తే షాక్ అవుతారు..!

by Anudeep

Ads

రోడ్డుపై అడుగు పెట్టమంటే అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉన్న గడ్డు రోజులలో ఎవరు ఎలాంటి వారో చెప్పడం కష్టతరమైపోతోంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఓ దొంగతనం చోటు చేసుకుంది. చాలా తెలివిగా ఓ మహిళ ఈ దొంగతనం చేసింది.

Video Advertisement

ఓ మహిళ 53.01 తులాల బంగారు ఆభరణాలను తన బ్యాగ్ లో పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు ట్రైన్ ఎక్కడానికి వచ్చింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన మరో మహిళ ఆమె వద్ద నుంచి గుట్టు చప్పుడు కాకుండా నగలు దొంగతనం చేసింది.

lift

అయితే దొంగతనం చేసిన మహిళను గుర్తించడానికి పోలీసులు ఏకంగా మూడొందల సిసి టివి కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నగరానికి చెందిన ఓ మహిళ 53.1 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని తన కుమార్తె ఇంట జరిగే శుభకార్యానికి వెళ్ళడానికి ఈ నెల పదిహేడవ తేదీన బయలుదేరింది. అయితే.. అదే సమయంలో గేటు నెం. 4 నుంచి ప్లాట్‌ఫాం వైపు వెళ్తున్న టైం లో కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీ తులసీనగర్‌కు చెందిన ఆరూరి ప్రియ (40) అనే మహిళ ఆమెని అనుసరించింది. ఆమెను అనుసరిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడ ఆమె వెనకే లిఫ్ట్ లో ఎక్కింది. చీర కొంగుని అడ్డుపెట్టి బ్యాగ్ లో ఉన్న బంగారు ఆభరణాలను తీసేసుకుని సైలెంట్ గా బయటకు వెళ్ళిపోయింది.

lift 1

అయితే.. కొంత సేపటికి బ్యాగ్ జిప్ తెరచి ఉండడం గమనించిన మహిళ అందులో నగలు లేకపోవడాన్ని గమనించింది. దీనితో ఆమె వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించింది. దీనితో పోలీసులు అప్రమత్తమై సిసి టివి ఫుటేజీలను చెక్ చేసారు. దాదాపు 300 ల కెమెరాలు పరిశీలించిన తరువాత సదరు మహిళ దొంగతనం చేసిన దృశ్యాలు.. ఆమె కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో ఉంటోందని గుర్తించారు. ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు 18 వ తేదీన ఆమె సికింద్రాబాద్‌ స్టేషన్‌ 4వ గేటు వద్ద ఉన్నట్లు గుర్తించి ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఆభరణాలను స్వాధీనం చేసుకుని.. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


End of Article

You may also like