Ads
- చిత్రం : ఆడవాళ్లు మీకు జోహార్లు
- నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక, ఊర్వశి.
- నిర్మాత : సుధాకర్ చెరుకూరి
- దర్శకత్వం : కిషోర్ తిరుమల
- సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
- విడుదల తేదీ : మార్చ్ 4, 2022
Video Advertisement
స్టోరీ :
చిరంజీవి (శర్వానంద్) కోసం తన కుటుంబం అంతా ఒక అమ్మాయిని చూస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక కారణం వల్ల అమ్మాయిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి చిరంజీవికి ఆద్య (రష్మిక మందన్న) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఆద్య తల్లి వకుళ (ఖుష్బూ) ఆద్యకి పెళ్లి చేయడానికి ఇష్టపడదు. అలా ఉండటానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. చిరంజీవి ఆద్య తల్లిని ఒప్పించాడా? ఆద్య చిరంజీవి వాళ్ళ కుటుంబానికి నచ్చిందా? చివరికి వారిద్దరి ప్రేమ కథ ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఇది ఒక కుటుంబ కథా చిత్రం అని సినిమా ట్రైలర్ చూడంగానే అర్థమైపోతుంది. సినిమా కూడా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీశారు. ఇలాంటి సినిమాల్లో కథలో కొత్తదనం కంటే టేకింగ్ లో కొత్తదనం ఉంటుంది. ఈ సినిమా కూడా అలానే ఉంది. కథ అంత పెద్ద కొత్తగా ఏమీ లేదు. కానీ సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండేలా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న నటీనటులు అందరూ బాగా నటించారు. అందులో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ అవ్వడంతో వారందరినీ తెరపై చూడటం బాగా అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది. సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా నిలిచింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా అంతా చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నట్టే సెకండ్ హాఫ్ సినిమా కూడా ఉంటే ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉండేది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- పాటలు
- సినిమాటోగ్రఫీ
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
- హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ
- కథలో కొత్తదనం లేకపోవడం
- చాలా స్లోగా నడిచే సెకండ్ హాఫ్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా, సెకండ్ హాఫ్ లో లోపాలు ఉండడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా యావరేజ్ గా నిలుస్తుంది.
End of Article