ఈ ఫోటో చూసి,టైటిల్ చూసి మీకేదో క్విజ్ లాంటిది పెడుతున్నాం అనుకుంటున్నారా ? కాదండి అసలు కాదు ఈ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏంటి అంటే డైలాగ్ కింగ్ ‘సాయి కుమార్’ కుమారుడు ఆది తెరంగ్రేటం చేసిన సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ సాదించారు..అటు తరువాత సరియైన హిట్ పడలేదు అనే చెప్పాలి..

Video Advertisement

ఇటీవలే విడుదల అయిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా కూడా పెద్దగా ప్రేక్షులని ఆకట్టుకోలేకపోయింది .కానీ ఏది ఏమైనా ప్రేక్షులని ఆకట్టుకునే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు హీరో ఆది ..ఇకపోతే మన స్టార్స్ దాదాపు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టీవ్ గానే ఉంటారని చెప్పాలి..ఇటీవలే ఆది కూడా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిరు ఎత్తుకుని ఉన్న ఒక ఫోటో తన అభిమానుల కోసం షేర్ చేసారు..ఈ ఫోటో ని సాయి కుమార్ నటించిన కలికాలం 100 డేస్ ఫంక్షన్ లో తీసినది..ఈ సినిమా 1991 సంవత్సరం లో విడుదల అయ్యింది ఈ సినిమాని ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాల దర్శకులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు.