Ads
తేదీ 20-03-2020, ఉదయం 5:30ని. టైం తర్వాత.. నిర్భయ నిందితులని తీహార్ జైల్లో “ఉరి తీశారు”. అనే వార్త కళ్లారా చూసే వరకు కానీ ఎవరికి నమ్మాలనిపించలేదు. ఒకటి రెండు కాదు సుమారు ఏడేళ్లుగా జరుగుతున్న న్యాయపోరాటంలో ఎట్టకేలకు న్యాయం గెలిచింది . చట్టంలో ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్నింటిని వాడుకుని తప్పించుకోవాలని చూసిన వారికి శిక్షపడింది.
Video Advertisement
నిర్భయ తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభకి కొంతలో కొంత న్యాయం జరిగింది. కూతురిని తీసుకురాలేకపోయినా , కూతురిని అత్యంత పాశవికంగా అత్యచారం చేసి చంపిన ఆ మానవమృగాలకి శిక్ష పడాలనుకున్న ఆ తల్లిదండ్రుల న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. నిర్భయకి న్యాయం జరిగింది ,న్యాయం జరిగింది అంటూ యావత్ దేశం ముక్త కంఠంతో మార్మోగిపోతోంది.
“ఆలస్యంగా అయినా సరే మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను. న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం పెరిగింది. నిర్భయ దోషులను ఉరి తీయడం వలన ఈ దేశంలోని తల్లిదండ్రులకి కూడా న్యాయం జరిగింది. . మా అమ్మాయికే కాదు , ఇకపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరి తరపున పోరాడతాం అని ఏడేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత దోషులకి శిక్షపడగానే నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడిన మాటలు ఇవి.
“నిర్భయ దోషులకి అనేక సార్లు శిక్షలు పడినప్పటికి, తప్పించుకుంటూ వచ్చారు. దీనివల్ల న్యాయవ్యవస్థలో ఎన్ని లొసుగులున్నాయో అవన్ని బయటికి వచ్చాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ భవిష్యత్లో ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన సత్వరంగా శిక్షపడేలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తండ్రి బద్రినాధ్ సింగ్.
డిసెంబర్ 16,2012 అర్దరాత్రి నిర్భయ అనుభవించిన నరకాన్ని ఇన్నేళ్లపాటు ఆ తల్లిదండ్రులు అనుభవించారు. కూతురిని చిత్రవధ చేసి నరకం చూపించిన ఆ క్రూరాతి క్రూర మృగాలకి శిక్షపడేవరకు అలుపెరగని పోరాటం చేశారు . అన్ని రకాల సాక్ష్యాలు ఉండి , దోషులు కళ్లముందే తిరుగుతున్నా శిక్షించడానికి ఇంత కాలం పట్టింది. అదే ఏ సాక్ష్యాలు మిగలకుండా పోతున్నా నిర్భయల సంగతి ఏంటో?
watch video:
End of Article