Ads
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి ఆపద్బాంధవుడు. ఈ సినిమాకి కే. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటాయి. అప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో చూసిన చిరంజీవిని ఇలా చూడడం ప్రేక్షకులకి కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ద్వారా మన అందరికీ చేరువైన నటి మీనాక్షి శేషాద్రి.
Video Advertisement
ఆపద్బాంధవుడు సినిమా తర్వాత మీనాక్షి శేషాద్రి నటనకి అందరూ అభిమానులు అయిపోయారు. 1983 లో వచ్చిన పెయింటర్ బాబు అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు మీనాక్షి శేషాద్రి. ఆ తర్వాత ఎన్నో హిందీ సినిమాల్లో నటించారు. ఆపద్బాంధవుడు కంటే ముందే 1991 లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు మీనాక్షి శేషాద్రి. ఇది మీనాక్షి శేషాద్రి తొలి తెలుగు సినిమా.
ఆ తర్వాత ఆపద్బాంధవుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అలాగే డ్యూయెట్ అనే తమిళ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా ఇదే పేరుతో డబ్ అయింది. మీనాక్షి శేషాద్రి చివరిగా సన్నీడియోల్ హీరోగా నటించిన ఘాయల్ సీక్వెల్ అయిన ఘాయల్ వన్స్ అగైన్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ద్వారా మళ్లీ కనిపించారు.
అంతకుముందు 1997 లో దో రాహేన్ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. 1995 లో సినిమాల నుండి రిటైర్ అయిపోయిన మీనాక్షి శేషాద్రి హరీష్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం టెక్సాస్ లో ఉంటున్నారు. భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పిస్తున్నారు. చారిటీ కోసం, ఫండ్ రైజింగ్ కోసం తన స్టూడెంట్స్ తో కలిసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు మీనాక్షి శేషాద్రి. మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం ఇలా ఉన్నారు.
End of Article