OTT లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ కొత్త సినిమా చూశారా..? ఏం ఉంది ఇందులో..?

OTT లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ కొత్త సినిమా చూశారా..? ఏం ఉంది ఇందులో..?

by Mohana Priya

Ads

ఈటీవీ విన్ యాప్ లో కొత్త సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. సస్పెన్స్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా పేరు ఆరంభం. మే 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోంది. మోహన్ భగత్, సుప్రీతా సూర్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే మిగిల్ (మోహన్ భగత్) జైలులో ఉంటాడు. ఒకరోజు అక్కడి నుండి కనిపించకుండా పోతాడు. సెల్ కి తాళం ఉంటుంది. కానీ అతను ఆ జైల్లో ఉండడు.

Video Advertisement

 aarambham etv win review telugu

అలా అని సెల్ లో ఇతర ఎలాంటి మార్పులు కూడా జరగవు. సెల్ అలాగే ఉంటుంది. గోడలు కూడా కూలవు. ఊచలు కూడా అలాగే ఉంటాయి. అయినా కూడా అతను ఎలా తప్పించుకున్నాడు అని, అధికారులు ఈ విషయాన్ని పరిష్కరించడానికి డిటెక్టివ్ చేతన్ (రవీంద్ర విజయ్) ని పిలుస్తారు. అదే సెల్ లో ఉండే మరొక వ్యక్తి గణేష్ (లక్ష్మణ్ మీసాల). మరొక పక్క బయట కొన్ని ప్రయోగాలు చేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యరావు (భూషణ్ కళ్యాణ్) వీళ్ళందరి కథలు ఏంటి? వీళ్ళందరి సహాయంతో అసలు విషయాన్ని ఎలా కనిపెట్టారు అనేది కథ. సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది.

అజయ్ నాగ్ వి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అభిషేక్ వి తిరుమలేశ్ ఈ సినిమాని నిర్మించారు. సింజిత్ ఎర్రంమిల్లి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో పనిచేసిన నటీనటులు అందరు కూడా చాలా బాగా నటించారు. ఒక కొత్త విషయం మీద ఈ సినిమాలో చూపించారు. కొన్ని సీన్స్ స్క్రీన్ ప్లే అంత బాగా ఆసక్తికరంగా లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారు. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని కూడా చివరిలో ఒక క్లూ ఇచ్చారు. తల్లి కొడుకుల మీద వచ్చే సీన్స్ చాలా బాగా చూపించారు. చాలా కొత్త పాయింట్ ఈ సినిమాలో చూపించారు.


End of Article

You may also like