Ads
ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర పై యాంకర్ గా సంచలనం సృష్టించారు. ప్రముఖ తెలుగు టీవీ షోలలో హోస్ట్ గా వ్యవహరించారు. ఓంకార్ జీ తెలుగు ఛానెల్ లో ఎన్నో షోలకు హోస్ట్ చేశాడు.
Video Advertisement
జీ తెలుగు ఛానెల్ ప్రసారం అయిన ఆట షో ద్వారా ఎంతోమంది ప్రతిభ కలిగిన వారు వెలుగులోకి వచ్చారు. వారిలో ఎక్కువమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. ఇందులో ఆట జూనియర్స్ లో బిట్టు అనే అబ్బాయి బాగా పాపులర్ అయ్యాడు. అతను ఇప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం..
యాంకర్ ఓంకార్ స్థిరపడిన తరువాత హిందీ టీవీ డ్యాన్స్ షోలు మాత్రమే ఉన్న సమయంలో వాటి మాదిరిగానే ఒక కాన్సెప్ట్ తో తెలుగులో డాన్స్ షోను నిర్మించాడు. ఆ షో పేరు ఆట. ఈ షో అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. రెండు సీజన్ల తరువాత ఆట జూనియర్స్ మొదలుపెట్టాడు. దీని అందరూ చిన్నపిల్లలే పోటీ పడతారు. ఈ డ్యాన్స్ షో కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆట జూనియర్స్ 7 వరకు ఈ షో ప్రసారం అయ్యింది.
అయితే ఆట జూనియర్స్ 5 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిట్టు అనే అబ్బాయి, ఒక్క డ్యాన్స్ తో మాత్రమే కాకుండా తన మిమిక్రీతో కూడా ఆకట్టుకున్నాడు. బిట్టు చాలామంది అభిమానచేవారు. ఆట జూనియర్స్ 5 ఎంటర్టైన్మెంట్ ట్రోఫిని అందుకున్నాడు. అతన్ని ఆటబిట్టు అని పిలుస్తుంటారు. ఆ తరువాత ఛాలెంజ్ డాన్స్ షో 3 పాల్గొని విన్నర్ అయ్యాడు.
ఈటీవీలో ప్రసారం అయిన ఆటైనా పాటైనా దేనికైనా రెడీలో పాల్గొన్న బిట్టు విజేతగా నిలిచాడు. ఆ తరువాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన కిరాక్ కిడ్స్ లో కూడా పాల్గొన్నాడు. వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు పెద్దగా యిన బిట్టు డ్యాన్సర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.
https://www.instagram.com/p/B2JkudQF-Pu/
Also Read: ప్రభాస్ చెప్పినట్టు చేసి ఉంటే “ఆదిపురుష్” సినిమా హిట్ అయ్యేదా..? ఇంతకీ అది ఏంటో తెలుసా..?
End of Article