“మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు.?” అనే ప్రశ్నకి… అబ్దుల్ కలాం గారు ఏం సమాధానం చెప్పారో తెలుసా..?

“మీరు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు.?” అనే ప్రశ్నకి… అబ్దుల్ కలాం గారు ఏం సమాధానం చెప్పారో తెలుసా..?

by Mohana Priya

Ads

భారతదేశంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఎన్నో జనరేషన్స్ లో ఉన్న వారికి స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గా నిలుస్తారు. ఆయన చేసిన భారత దేశానికి చేసిన సేవలు ఎంతో కాలం గుర్తుండిపోతాయి.abdul kalam about why he did not get married

Video Advertisement

అలాగే ఆయన ఎంతో మంచి వ్యక్తి అనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చి, అంచెలంచలుగా పైకెదిగి గారు అబ్దుల్ కలాం గారు. అయితే, అబ్దుల్ కలాం గారు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని విషయం గురించి చాలా మందికి జవాబు తెలీదు. అయితే ఇదే ప్రశ్నకు జవాబు కోసం ఒక వ్యక్తి అబ్దుల్ కలాం గారిని ఈ ప్రశ్న అడిగారు. ఈ సంఘటన ఫిబ్రవరి 2006 లో జరిగింది.abdul kalam about why he did not get married

అబ్దుల్ కలాం గారు స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఒక స్టూడెంట్, “సర్, మీకు ఇప్పటివరకు జీవిత భాగస్వామి ఎందుకు దొరకలేదు?” అని అడిగారు. అందుకు అబ్దుల్ కలాం గారు కొంచెం సేపు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత ఈ విధంగా సమాధానం చెప్పారు. “మీ అందరూ ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ని పొందాలి అని నేను ఆశిస్తున్నాను” అని చెప్పారు. ఈ సంఘటన సింగపూర్ లో జరిగింది.abdul kalam about why he did not get married

ఆ తర్వాత రాంచీలో ఒకరు, “మీరు ఎప్పుడూ, ఏ అమ్మాయితో ప్రేమలో పడలేదా? పెళ్లి ఎందుకు చేసుకోలేదు?” అని అడిగారు. అందుకు అబ్దుల్ కలాం గారు, “నాకు జ్ఞానం సంపాదించడం అంటే ఇష్టం. బోధించడం కూడా చాలా ఇష్టం. అందుకే నేను మీకు జీవితానికి సంబంధించిన పాఠాలను నేర్పడానికి ఇక్కడికి వచ్చాను” అని అన్నారు.abdul kalam about why he did not get married

అయితే అబ్దుల్ కలాం గారు పెళ్లి చేసుకోకపోవడానికి ఇంకొక కారణం కూడా తెలిపారు. అదేంటంటే. “పెళ్లి, పిల్లలు అనేవి జీవితంలో స్వార్థానికి దారితీస్తాయి. నాకు స్వార్ధపరుడిగా ఉండాలని లేదు. నాకు నా దేశం కోసం ఎంత వీలైతే అంత సేవ చేయాలి అని ఉంది” అని అన్నారు. ఆయన ఎందుకని అంత గొప్ప వ్యక్తి అయ్యారో ఈ పాటికే మనకి అర్థమైపోయి ఉంటుంది.


End of Article

You may also like