Ads
తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. అభినయ పుట్టుకతోనే చెవిటి మరియు మూగ. అయితే తల్లిదండ్రులు ఆవిడను ఎలా అయినా మాట్లాడించాలి అని అనుకున్నారు.
Video Advertisement
అందుకోసం ఎంతో కష్టపడి వైద్యం అందించడానికి 11 లక్షల వరకు అప్పు చేసి తీసుకువచ్చారు. చెన్నై నుండి హైదరాబాద్ కు ఆమెను తీసుకు వచ్చారు. ఆ తర్వాత స్పీచ్ థెరపీ వంటివి కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఉపయోగం లేకపోయింది. కానీ ఆమె అభినయం ఏమాత్రం తగ్గలేదు. తను ఏడవ తరగతి లో ఉన్నప్పుడే చైల్డ్ యాక్టర్ గా నటించింది.
ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాలేదు. దీనికి గల కారణం ఏమిటంటే వినలేక పోవడం మాట్లాడకపోవడమే. కానీ ఆమెకి నటన అంటే ఎంతో ఇష్టం తండ్రి అభినయను యాడ్స్ లో అయినా నటింపచేయాలని ప్రయత్నాలు చేశారు. దీంతో ఆమెకు యాడ్స్ లో నటించే అవకాశం దక్కింది. ఆమె తండ్రికి కూడా నటన అంటే ఇష్టం తో ఆయన కూడా యాడ్స్ లో నటించారు. ఇదిలా ఉంటే నాదో దిగల్ అని ఒక సినిమాలో ముంబై యాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు.
ఆమెకి తమిళ్ మాట్లాడడం కష్టం అవ్వడం తో సినిమా చేయాలని ఆమె వెళ్ళిపోయారు. దీంతో ఎలా అయినా సరే కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ ని తీసుకువచ్చి సినిమా చేయాలని డైరెక్టర్ కోప్పడ్డారు. అప్పటికప్పుడే అభినయని తీసుకువచ్చి వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమా బాగా హిట్ అయ్యింది. ఆ సినిమాకి అభినయ 13 అవార్డులు కూడా వచ్చాయి. ఈ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో గా తెరకెక్కించారు.
కన్నడలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈమెకి వినపడదు పైగా మాట్లాడలేదు కనుక ఎలా నిర్మించాలి అన్న సందేహం మీలో కలిగి ఉండొచ్చు. అది ఎలా అంటే డైలాగ్స్ ని డైరెక్టర్స్ ముందుగా ఆమె తల్లిదండ్రులకు చెప్పేవాళ్ళు. దానిని వాళ్ళు తన కూతురికి సైగల ద్వారా చెప్పారు. దీంతో సింగిల్ టేక్‌లో అభినయ ఎక్స్ప్రెషన్ ఇచ్చేది. శంభో శివ శంభో సినిమా తర్వాత దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలలో ఈమె నటించారు.
End of Article