ఇండియన్ ఆర్మీలో మహిళా శక్తి “రుచి శర్మ”…ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

ఇండియన్ ఆర్మీలో మహిళా శక్తి “రుచి శర్మ”…ఆమె గురించి ఈ విషయాలు తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

by Anudeep

Ads

ఆడవాళ్లు కూడా యుద్దం చేయగలరు. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఏదో ఒక యుద్దం చేస్తూనే ఉంటుంది. కొందరు విధ్య కోసం, మరికొందరు కుటుంబం కోసం, కొందరు ఉద్యోగం కోసం..ఇలా ప్రతి చోట స్త్రీలకు పరీక్షలే, యుద్దంతో సమానమే. మరి దేశం కోసం యుద్దం చేసేవాళ్ల గురించి మాట్లాడుకుందామా.. రుచి శర్మ మొట్టమొదటి పారాట్రూటర్.  ఎవరీ రుచి శర్మ,  పారా ట్రూటర్ అంటే ఏంటి? ఈమె వార్తల్లోకి ఎందుకొచ్చింది.

Video Advertisement

#sheinspiresus అనే హాష్ టాగ్ తో మీకు తెలిసిన టాలెంటెడ్ లేడీస్ ని ట్యాగ్ చేయమని మొన్న మహిళా దినోత్సవం నాడు మోడీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. అలా ఎవరైతే ఇన్స్పైర్ చేసిన ఐరన్ లేడికి నా సోషల్ మీడియా ఖాతాలని ఒక్కరోజు పాటు అప్పగిస్తానని అన్నారు. ఆ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న మహిళ రుచి శర్మ.

ఈ అవకాశమేం చాలా సింపుల్ గా దక్కలేదు. అసలు వార్తలోకి వెళ్తే మోడీ అనౌన్స్ మెంట్ కి స్పందిస్తూ శీలాభట్ అనే మహిళ కెప్టెన్ రుచిశర్మ పేరుని ప్రతిపాదించింది. రుచిశర్మ స్టోరిని పిఎంఓ కి పంపింది, అది చదివిన పిఎంఒ  రుచిశర్మని ఇన్స్పైర్డ్ పర్సన్ గా సెలక్ట్ చేసింది. రుచిశర్మకి సంబందించి డిఫెన్స్ మినిస్ట్రీ “ఆకాశానికి హద్దులేదు, కెప్టెన్ రుచి శర్మ ఇప్పటికి మహిళల్లో స్పూర్తి నింపుతూనే ఉన్నారని” ట్వీట్ చేసింది. అంతేకాకుండా మోడీ ఖాతాలను రుచిశర్మకి ఒకరోజు అప్పగిస్తున్నామని అనౌన్స్ చేశారు.

దేశ ప్రధానిని ఇన్స్పైర్ చేసిన ఆ ఐరన్ లేడి ఎవరా అని అందరూ తెలుసుకోవాలనుకున్నారు. రుచిశర్మ గురించి క్లుప్తంగా ఆమె మొట్టమొదటి పారా ట్రూపర్. యుద్దసమయంలో పారాచూట్ సాయంతో శతృభూబాగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు ఈ పారాట్రూపర్స్ కి ఇచ్చే శిక్షణ కూడా చాలా కఠినంగా ఉంటుంది. రుచి శర్మ ఫాధర్ కూడా ఆర్మి ఆఫీసరే, అంతేకాదు ఆర్మీ ఆఫీసర్నే తను వివాహం చేసుకున్నారు.

1996 లో భారత ఆర్మిలో చేరిన రుచి శర్మ.,అప్పటినుండి 2003 వరకు విశిష్ట సేవలందించారు. ఆ సేవల్లో భాగంగానే మొట్టమొదటి పారాట్రూపర్ గా ఎన్నికయ్యారు . పారాట్రూపర్ అంటే  అంత ఆషామాషి వ్యవహారం కాదు. శతృవుల భూబాగంలోకి వెళ్లాక కాలినడకన నడవాల్సి ఉంటుంది.  వీపుకి 10కిలోల బరువు కట్టుకుని 40 నుండి 50 కిలో మీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. పారాట్రూపర్ ట్రైయినింగ్ లో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

ఆడవాళ్ళెప్పుడూ ఆరోగ్యంగా , బలంగా ఉంటారని. వారని తక్కువ అంచనా వేయకూడదని. తాను ఇప్పటికి యుద్దానికి రెడీగా ఉన్నానన, ప్రధాని మోడీ సోషల్ మీడియా బాధ్యత చూసుకునే అరుదైన అవకాశం తనకి దక్కడం సంతోషం అని అన్నారు. లేడీస్ మరింత మంది ఆర్మిలోకి రావడానికి ముందుకు రావాలని, వారికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో అవసరం అని రుచిశర్మ అన్నారు.


End of Article

You may also like