Ads
ఒకప్పుడు సినిమా అంటే రొటీన్ గా రెండు సమస్యలు, మూడు ఫైట్లు, నాలుగు పాటలు, లాస్ట్ లో అందరూ కలిసిపోవడం, శుభం కార్డు పడిపోవటం ఇదే సినిమా అంటే. అయితే అలాంటి రొడ్డ కొట్టుడు సినిమాలని ఇప్పుడు జనం కన్నెత్తి చూడటం లేదు. ఎంత హై బడ్జెట్ సినిమా అయినప్పటికీ కంటెంట్ నచ్చకపోతే తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. అలాగే కంటెంట్ కొత్తగా ఉంటే ఏ భాషలో సినిమాని అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటి సినిమా ఒకటి మలయాళం లో వచ్చి అద్భుతమైన హిట్ కొట్టింది.
Video Advertisement
అదే అబ్రహం ఓజ్లర్. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ సినిమాని మిథున్ మాన్యువల్ థామస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోగా జయరాం నటించారు. సీరియల్ కిల్లర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. జనవరి 11న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్లను వసూలు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. డిస్నీ+హాట్ స్టార్ లో మార్చ్ 20 నుండి మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక కథ విషయానికి వస్తే అబ్రహం ఓజ్లర్ ( జయరాం ) ని కుటుంబ సభ్యులు మిస్ అవుతారు, తర్వాత వరుసగా హత్యలు జరుగుతూ ఉండటం, ఒక హత్యకి మరొక హత్యకి సంబంధం లేకపోవడం, హత్య జరిగిన ప్లేస్ లో హ్యాపీ బర్త్డే అని రాసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటినీ చూసిన అబ్రహం ఓజ్లర్ కేసుని ఛేదించి కుటుంబాన్ని కలుసుకుంటాడు.
అయితే కిడ్నాపర్ ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేసి చంపేవాడు అనేది ఈ సినిమా కధ. అయితే ఈ సినిమా ఎలాంటి ప్రకటనలు లేకుండా సైలెంట్ గా ఓటీటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాని చూడకపోతే చూసేయండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.
End of Article